‘మైసా’ నుంచి క్రేజీ అప్‌డేట్..

- April 05, 2026 , by Maagulf
‘మైసా’ నుంచి క్రేజీ అప్‌డేట్..

టాలీవుడ్ సెన్సేషన్ రష్మిక మందన్న ప్రధాన పాత్రలో నటిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘మైసా’. రవీంద్ర పూలే దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఒక లేడీ ఓరియంటెడ్ యాక్షన్ డ్రామాగా రూపొందుతోంది. రష్మిక పుట్టినరోజును పురస్కరించుకుని చిత్ర బృందం ఈ సినిమాకు సంబంధించిన ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ సరికొత్త పోస్టర్‌లో రష్మిక మునుపెన్నడూ చూడని విధంగా పూర్తి మాస్ మరియు యాక్షన్ మోడ్‌లో కనిపించి అభిమానులను ఆశ్చర్యపరిచింది.

‘అన్ ఫార్ములా ఫిల్మ్స్’ పతాకం పై అత్యంత భారీ వ్యయంతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కేవలం తెలుగులోనే కాకుండా, పాన్ ఇండియా స్థాయిలో పలు భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. ఫిమేల్ సెంట్రిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ‘మైసా’, రష్మిక కెరీర్‌లో ఒక మైలురాయిగా నిలుస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం 2026లో ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com