‘పేట్రియాట్’ ట్రైలర్ రిలీజ్
- April 05, 2026
మలయాళ చిత్ర పరిశ్రమలో దశాబ్దాల కాలం తర్వాత ఇద్దరు ధృవతారలు మమ్ముట్టి, మోహన్‌లాల్ ఒకే ఫ్రేమ్‌లో కనిపిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘పేట్రియాట్’ (Patriot). ఈ క్రేజీ మల్టీస్టారర్ ట్రైలర్ విడుదలవ్వడమే కాకుండా, సోషల్ మీడియాలో రికార్డులను తిరగరాస్తోంది. బ్రిలియంట్ డైరెక్టర్ మహేష్ నారాయణన్ మలయాళ సినిమా స్థాయిని మరో మెట్టు ఎక్కించేలా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.
చాలా ఏళ్ల నిరీక్షణ తర్వాత మలయాళ ఇండస్ట్రీకి చెందిన ఇద్దరు బిగ్గెస్ట్ స్టార్స్ కలిసి నటిస్తుండటంతో ఈ ట్రైలర్ నేషనల్ వైడ్ టాపిక్ అయింది.ట్రైలర్‌ను గమనిస్తే ఇది దేశభక్తి నేపథ్యంలో సాగే హై-వోల్టేజ్ పొలిటికల్ యాక్షన్ డ్రామాగా కనిపిస్తోంది. ట్రైలర్‌లో మమ్ముట్టి, మోహన్‌లాల్ ఇద్దరి స్క్రీన్ ప్రెజెన్స్, వారి పవర్‌ఫుల్ డైలాగ్స్ మరియు క్యారెక్టరైజేషన్స్ అభిమానులకు పూనకాలు తెప్పించేలా ఉన్నాయి. మహేష్ నారాయణన్ టేకింగ్,అత్యున్నత ప్రమాణాలతో కూడిన విజువల్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ట్రైలర్‌ను మరో లెవెల్‌కు తీసుకెళ్లాయి. చాలా కాలం తర్వాత ఈ ఇద్దరు దిగ్గజాలు ఒకే ఫ్రేమ్‌లో కనిపించడంతో మలయాళ ఇండస్ట్రీలోనే కాకుండా తెలుగు, తమిళ, హిందీ చిత్ర పరిశ్రమల్లో కూడా ఈ సినిమా హాట్ టాపిక్‌గా మారింది. ఈ ట్రైలర్ చూసిన సినీ ప్రియులు, ఇద్దరు మహానటుల నటనను వెండితెరపై చూడటానికి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
తాజా వార్తలు
- చెన్నై పై ఆర్సీబీ ఘనవిజయం
- గ్లోబల్ స్పోర్ట్స్ హబ్ గా తెలంగాణ: సీఎం రేవంత్
- పాన్ కార్డు కొత్త రూల్స్..
- యూఏఈ అధ్యక్షుడు–ఇటలీ ప్రధాని భేటీ
- హైదరాబాద్‌లో మూడో భారీ బస్ టెర్మినల్
- ‘ఉగాది గీతాంజలి’ వేడుకలో మెరిసిన మలేషియా–భారత సాంస్కృతిక బంధాలు
- లూలూ హైపర్ మార్కెట్ లో షాప్ నౌ, పే లేటర్..!!
- అల్ సువైఖ్లో ఇద్దరు ఆసియా జాతీయులు అరెస్టు..!!
- మాల్స్ పార్కింగ్ ఏరియాల్లో గాలి నాణ్యతపై కీలక అప్డేట్..!!
- కంపెనీలు ఉద్యోగుల తొలగింపులను నివారించవచ్చా?









