పాక్ కు 300 మిలియన్ డాలర్ల ఇవ్వం: అమెరికా రక్షణ విభాగం
- August 04, 2016
పాకిస్థాన్‌కు అమెరికా గట్టి షాక్ ఇచ్చింది. పాక్‌కు మిలిటరీ రీయింబర్స్మెంట్ కింద ఇచ్చే 300 మిలియన్ డాలర్ల డబ్బును ఇవ్వబోమని అమెరికా రక్షణ విభాగం (పెంటగాన్) ప్రకటించింది. పాక్ అక్కడి ఉగ్రవాదుల హఖ్ఖాని నెట్‌వర్క్‌పై తగిన చర్యలు తీసుకోనందున అమెరికా సెక్రటరీ ఆఫ్ డిఫెన్స్ యాష్ కార్టర్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు అమెరికా అధికారులు వెల్లడించారు. పాక్‌కు మిలిటరీ రీయింబర్స్మెంట్ కింద ఇవ్వాల్సిన 300 మిలియన్ డాలర్ల నిధులను నిలిపేస్తున్నట్లు తెలిపారు. గత దశాబ్ద కాలంగా అమెరికా, పాక్‌ల మధ్య సంబంధాలు దెబ్బతింటున్నాయి. పాకిస్థాన్ ఇస్లామిస్ట్ సంస్థలు, అఫ్గాన్ తాలిబన్లు, హఖ్కాని నెట్వర్క్ తదితర ఉగ్రవాదులపై చర్యలు తీసుకోవడానికి ఆసక్తిగా లేకపోవడం అమెరికాకు ఆగ్రహం కలిగిస్తోంది.
ఈ 300 మిలియన్ డాలర్లు సంకీర్ణ మద్దతు నిధుల(సీఎస్ఎఫ్) కింద ఇవ్వాల్సి ఉంది. ఉగ్రవాద వ్యతిరేక, తిరుగుబాటు వ్యతిరేక పోరాటానికి సాయం అందించడానికి ఈ నిధులు ఇస్తారు. 2002 నుంచి అమెరికా ఇప్పటికే పాక్‌కు అమెరికా సీఎస్ఎఫ్ కింద 14 బిలియన్ డాలర్లు ఇచ్చింది. పాక్‌లో ఉగ్రవాద ప్రభావం అధికంగా ఉన్న ఉత్తర వజీరిస్థాన్ ప్రాంతంలో పాకిస్థాన్ చర్యల్లో పురోగతి కోరుకుంటూ అమెరికా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్‌లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్‌లో భారతీయ పాస్‌పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..







