తెలంగాణ జర్నలిస్టులకు కీలక అప్‌డేట్

- April 07, 2026 , by Maagulf
తెలంగాణ జర్నలిస్టులకు కీలక అప్‌డేట్

హైదరాబాద్: తెలంగాణ జర్నలిస్టులకు కీలక అప్‌డేట్: లంగాణలో జర్నలిస్టుల అక్రిడిటేషన్ కార్డుల జారీపై సమాచార పౌరసంబంధాల శాఖ స్పెషల్ కమిషనర్ సీహెచ్. ప్రియాంక కీలక ప్రకటన చేశారు.అక్రిడిటేషన్‌కు సంబంధించిన దరఖాస్తుల ప్రక్రియ నిరంతరం కొనసాగుతోందని ఆమె తెలిపారు.

కమిటీ సమావేశంలో దరఖాస్తుల పరిశీలన
ఏప్రిల్ 10న జరిగే రాష్ట్ర స్థాయి అక్రిడిటేషన్ కమిటీ సమావేశంలో రాష్ట్రవ్యాప్తంగా వచ్చిన దరఖాస్తులను పరిశీలించనున్నట్లు తెలిపారు. అర్హులైన జర్నలిస్టులకు కొత్త అక్రిడిటేషన్ కార్డులు మంజూరు చేస్తామని స్పష్టం చేశారు.

ఆన్‌లైన్‌లో దరఖాస్తు సూచన
అర్హులైన జర్నలిస్టులు తమ దరఖాస్తులను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాలని అధికారులు సూచించారు. జిల్లా స్థాయిలో కూడా ఈ నెలలోనే కమిటీ సమావేశాలు నిర్వహించి అర్హులైన వారికి అక్రిడిటేషన్ కార్డులు జారీ చేసే ప్రక్రియ పూర్తి చేస్తామని తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com