యూఏఈ పర్యటనలో మరణించిన భారతీయురాలు..30 రోజుల తర్వాత స్వదేశానికి డెడ్ బాడీ తరలింపు..!!
- April 08, 2026
యూఏఈః యూఏఈ పర్యటనలో మరణించిన ముగ్గురు పిల్లల తల్లి మృతదేహాం ఎట్టకేలకు దాదాపు 30 రోజుల తర్వాత స్వదేశానికి చేరింది. లోకల్ కమ్యూనిటీ సాయంతో కేరళకు చెందిన 31 ఏళ్ల ఎస్.కె.జె. మృతదేహాన్ని ఏప్రిల్ 6న స్వదేశానికి పంపించగా..ఆమె స్వస్థలమైన ఫోర్ట్ కోచీలో అంత్యక్రియలు ముగిసాయి. "ఆమె మృతదేహాన్ని స్వదేశానికి తీసుకురావడానికి పడిన కష్టాల తర్వాత, ఆమెకు శాంతి చేకూర్చడం ఒక ఉపశమనం." అని ఆమె భర్త తెలిపారు.
ముగ్గురు పిల్లల తల్లి అయిన ఆమె, ఈ విషాదం జరగడానికి 45 రోజుల ముందు యూఏఈలో ఉన్నారు. "మొదట ఒక డేకేర్ సెంటర్లో పనిచేసి, సుమారు మూడు నాలుగు నెలల క్రితం భారతదేశానికి తిరిగి వచ్చారు. కానీ ఆమెకు మంచి ఉద్యోగం కావాలని, విజిట్ వీసాపై దుబాయ్‌కి తిరిగి వెళ్లారు." అని ఆమె భర్త వెల్లడించారు.
ఆమె విజిట్ వీసాపై ఉండగా మరణించడంతో, ఆమె మృతదేహాన్ని స్వదేశానికి తీసుకువచ్చే బాధ్యతను ఎవరూ తీసుకోలేదు. కేరళలో రోజువారీ కూలీగా పనిచేసే ఆమె భర్త ఆ ఖర్చులను భరించలేకపోయారు. అప్పుడు ఆ కుటుంబం ఒక రాజకీయ నాయకుడిని సంప్రదించగా, ఆయన సహాయం కోసం యూఏఈలోని స్థానిక సామాజిక కార్యకర్తలను సంప్రదించారు.
మృతదేహాన్ని స్వదేశానికి చేర్చేందుకు అవసరమైన నిధులను దుబాయ్‌కు చెందిన ఒక వ్యాపారవేత్త సలాం పాపినస్సేరి అందజేశారు. యుద్ధ పరిస్థితులు ఆ కుటుంబం కష్టాలను మరింత పెంచిందని ఆయన అన్నారు. "విమానాలు రద్దు కావడం వల్ల టిక్కెట్ల ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో, ఆమె మృతదేహాన్ని భారతదేశానికి తిరిగి తీసుకురావడానికి ఆ కుటుంబానికి ఆర్థిక స్తోమత లేకుండా పోయింది." అని ఆయన అన్నారు. వారు కేరళ ప్రతిపక్ష నాయకుడు వి.డి. సతీశన్‌ను సంప్రదించగా, ఆయన ఆ విషయాన్ని తనకు తెలియజేశారని పేర్కొన్నారు. షార్జా కేంద్రంగా పనిచేసే 'YAB Legal' సంస్థకు CEO అయిన సలాం.. SKJ మృతదేహాన్ని స్వదేశానికి తరలించడానికి అవసరమైన అన్ని చర్యలను స్వయంగా పర్యవేక్షించారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







