33,250 టయోటా, లెక్సస్ వాహనాలు రీకాల్..!!

- April 13, 2026 , by Maagulf
33,250 టయోటా, లెక్సస్ వాహనాలు రీకాల్..!!

రియాద్ః ఎలక్ట్రానిక్ ప్రోగ్రామింగ్ లోపం కారణంగా 33,250 టయోటా మరియు లెక్సస్ వాహనాలను వాణిజ్య మంత్రిత్వ శాఖ వెనక్కి(రీకాల్) పిలిచింది. వాహనాల ఎలక్ట్రానిక్ కంట్రోల్ యూనిట్ (ECU) సాఫ్ట్‌వేర్‌లో ఏర్పడిన సాంకేతిక లోపం వల్ల పార్కింగ్ చేసే సమయాల్లో వాహనాన్ని 'రివర్స్' గేర్‌లోకి మార్చినప్పుడు వెనుక వైపు దృశ్యాన్ని చూపించే కెమెరా (rearview camera)  స్క్రీన్‌పై కనిపించకపోవచ్చని మంత్రిత్వ శాఖ వివరించింది.

ఈ లోపం 2022 నుండి 2025 మధ్య తయారైన పలు టయోటా మరియు లెక్సస్ మోడళ్లను ప్రభావితం చేస్తుందన్నారు. వీటిలో Land Cruiser, Crown, LX600, Prado, LC500, Mirai, Highlander, Camry, LS500/LS500h, RX, UX, NX మరియు ES మోడళ్లు ఉన్నాయని తెలిపింది. తమ వాహనాలు ఈ రీకాల్ జాబితాలో ఉన్నాయో లేదో తెలుసుకోవడానికి, వినియోగదారులు Recalls.sa వెబ్‌సైట్ లో తమ వాహన గుర్తింపు సంఖ్యను (VIN) నమోదు చేసి తనిఖీ చేసుకోవాలని మంత్రిత్వ శాఖ సూచించింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com