ఎమ్‌ఐ-17 హెలికాప్టర్‌ అఫ్గానిస్థాన్‌లో ల్యాండవుతూ కూలి పోయింది

- August 05, 2016 , by Maagulf
ఎమ్‌ఐ-17 హెలికాప్టర్‌ అఫ్గానిస్థాన్‌లో ల్యాండవుతూ కూలి పోయింది

పాకిస్థాన్‌కి చెందిన ఎమ్‌ఐ-17 హెలికాప్టర్‌ అఫ్గానిస్థాన్‌లో ల్యాండవుతూ కూలి పోయింది. రష్యాలో తయారైన ఈ హెలికాప్టర్‌ను పంజాబ్‌ ప్రావిన్షియల్‌ ప్రభుత్వానికి చెందినది. రొటీన్‌ సర్వీసులు నిమిత్తం హెలికాప్టర్‌ రష్యాకి వెళుతుండగాసాంకేతిక లోపంతో అఫ్గానిస్థాన్‌లోని లోగర్‌ ప్రావిన్స్‌లోని అజ్రా జిల్లాలో ల్యాండ్‌ అవబోతుండగా కూలిపోయింది. ఇది ముష్కరుల పనేనని, హెలికాప్టర్‌లో ఉన్న ఏడుగురు సిబ్బందిని తాలిబన్‌ ఉగ్రవాదులు తమ ఆదీనంలోకి తీసుకుని ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. అఫ్గాన్‌లో కూలిపోయింది తమ హెలికాప్టరేనని కానీ అక్కడి ప్రభుత్వం అధికారికంగా ఏ వివరాలు వెల్లడించలేదని పంజాబ్‌ ప్రభుత్వాధికారులు తెలిపారు. హెలికాప్టర్‌లో ఉన్న ఏడుగురి ఆచూకీ కూడా తెలియరాలేదని అందులో రష్యాకి చెందిన ఇంజినీర్‌, ఆరుగురు పాకిస్థానీలు ఉన్నట్లు పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com