ప్రతికూలతల పై స్ఫూర్తిదాయక విజయానికి అంబేద్కర్ జీవితం నిదర్శనం: గవర్నర్ శివప్రతాప్ శుక్లా
- April 14, 2026
హైదరాబాద్: రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు మంగళవారం లోక్‌భవన్‌లో ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా డా. బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ, డా.అంబేద్కర్‌ను భారతదేశపు గొప్ప పుత్రులలో ఒకరిగా, రాజ్యాంగ ప్రధాన రూపశిల్పిగా అభివర్ణించారు. "ప్రతికూలతలపై మానవ స్ఫూర్తి సాధించిన విజయానికి అంబేద్కర్ జీవితం నిదర్శనం అన్నారు.దార్శనిక సంఘ సంస్కర్త, ప్రముఖ న్యాయకోవిదుడైన ఆయన న్యాయం, సమానత్వం, అణగారిన వర్గాల సాధికారతకు జీవితాన్ని అంకితం చేశారు.పేదలు, అణగారిన వర్గాల హక్కుల పరిరక్షణకు ఆయన విశేష కృషి చేశారని కొనియాడారు.
రాజ్యాంగం ప్రపంచంలోనే అత్యుత్తమమైనదని పేర్కొన్న గవర్నర్, రాజ్యాంగ ఆదర్శాల పట్ల ప్రతి పౌరుడూ నిబద్ధతను పునరుద్ఘాటించాలన్నారు. "బాబాసాహెబ్ ప్రతిపాదించిన ఐక్యత, సౌభ్రాతృత్వ స్ఫూర్తితో ముందుకు సాగాలి.దేశ వైభవాన్ని పునరుద్ధరించడానికి, అందరికీ న్యాయమైన, సమ్మిళిత సమాజాన్ని నిర్మించడానికి సమిష్టిగా కృషి చేద్దాం" అని యువతకు పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.దాన కిషోర్, లోక్‌భవన్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
తాజా వార్తలు
- యూఏఈలో అక్టోబర్ నుంచి అధిక వర్షాలు?
- సౌదీ అరేబియాలో వడ్డీ రేట్లు పెంపు..!!
- హోర్ముజ్ జలసంధి పరిస్థితిపై ఒమన్ కీలక ప్రకటన..!!
- కువైట్‌లో డ్రోన్లపై మరోసారి హెచ్చరిక జారీ..!!
- బహ్రెయిన్‌లో ఆలీ వాక్‌వేకు కొత్త రూపు..!!
- ఖతార్‌లో కీలక వడ్డీ రేట్లు పెంపు..!!
- గ్లోబల్ విలేజ్ సీజన్ 31 VIP ప్యాక్స్ విక్రయ తేదీలు వెల్లడి
- TGSRTC సంచలన నిర్ణయం..
- ఎయిర్ ఇండియా, ఉజ్బెకిస్థాన్ ఎయిర్‌వేస్‌తో ఫ్లైడుబాయ్ కొత్త భాగస్వామ్యాలు
- జనవరి 14 నుంచి ఉమెన్స్ ప్రీమియర్ లీగ్(WPL) ఐదో సీజన్.. !







