కతారాలో ఎలైట్ ఎగ్జిబిషన్ 2026 ప్రారంభం..!!
- April 14, 2026
దోహా: కతారాలోని ఖతారీ అసోసియేషన్ ఫర్ ఫైన్ ఆర్ట్స్ ప్రధాన కార్యాలయంలోని బిల్డింగ్ 13లో ఎలైట్ ఎగ్జిబిషన్ 2026ను కల్చరల్ విలేజ్ (కతారా) డైరెక్టర్ జనరల్ ప్రొఫెసర్ డాక్టర్ ఖాలిద్ బిన్ ఇబ్రహీం అల్-సులైతి అధికారికంగా ప్రారంభించారు.
ఇది సందర్శకుల కోసం ప్రముఖ ఖతారీ కళాకారుల కళాఖండాలను ఒకచోట చేర్చింది. ఈ సందర్భంగా విజిటర్స్, అతిథులు ప్రదర్శనలో ఉన్న కళాఖండాలను చూసి, వాటి ప్రత్యేకతల గురించి కళాకారులను అడిగి తెలుసుకున్నారు.
గ్రీన్, రెడ్ మరియు ఎల్లో కలర్స్ లో విలక్షణమైన రేఖాగణిత మోడల్స్ తో కూడిన అద్భుతమైన అబ్స్ట్రాక్ట్ పెయింటింగ్‌లు ఈ ప్రదర్శనలోని హైలెట్ గా నిలుస్తున్నాయి. ఇలాంటి అనేక ఖతారీ వారసత్వ కళాఖండాలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి.
డాక్టర్ అల్-సులైతి ఉన్నతాధికారులతో కలిసి ప్రదర్శనను తిలకించారు. ఖతార్ ప్రధాన సాంస్కృతిక గమ్యస్థానంగా కతారా కల్చరల్ విలేజ్ తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంటూనే ఉందని పేర్కొన్నారు. ఇది ఖతారీ అసోసియేషన్ ఫర్ ఫైన్ ఆర్ట్స్ కు ఒక శాశ్వత వేదికను అందిస్తోందని తెలిపారు.
తాజా వార్తలు
- కువైట్‌లో T5 టెర్మినల్ పునఃప్రారంభం పై సోషల్ మీడియాలో వైరల్ వార్తలు ఫేక్: DGCA స్పష్టీకరణ
- IPL 2026: కోల్‌కతా పై చెన్నై ఘన విజయం
- దోహాలో ఘనంగా డా.బి.ఆర్.అంబేద్కర్ జయంతి వేడుకలు
- శంషాబాద్‌లో నకిలీ CISF అధికారి గుట్టురట్టు!
- ఏప్రిల్ 15 నుంచి కొత్త జరిమానా నిబంధనలు అమలు
- ట్రంప్‌తో 40 నిమిషాలు మాట్లాడిన ప్రధాని మోదీ..
- బిహార్ కొత్త సీఎం గా సామ్రాట్ చౌదరి..!
- భారత్ లో ‘టెక్నోవర్స్ హ్యాకథాన్ 2026’ ప్రారంభం!
- తెలంగాణలో వీఐపీ సెక్యూరిటీ తగ్గింపు: డీజీపీ శివధర్‌రెడ్డి
- ఛత్తీస్ గఢ్ లోని వేదాంత పవర్ ప్లాంట్‌లో భారీ పేలుడు, 9 మంది మృతి









