అప్పులు చెల్లించకుంటే.. మూడేళ్ల ట్రావెల్ బ్యాన్..!!
- April 14, 2026
మనామా: అప్పులు చెల్లించని వారిపై గరిష్టంగా మూడేళ్ల వరకు ప్రయాణ నిషేధాన్ని విధించేందుకు అనుమతించాలని ఐదుగురు ఎంపీలు ప్రతిపాదించారు. అప్పులు చెల్లించకుండా కొంతమంది వ్యక్తులు బహ్రెయిన్ విడిచి తప్పించుకుపోతున్నారని, అలాంటి వారిని నిరోధించడానికి ఎక్కువ కాలం ట్రావెల్ బ్యాన్ విధించడం ఒక్కటే పరిష్కారం అని తెలిపారు.
ఎంపీలు ఖాలిద్ బువానాఖ్, అహ్మద్ అల్ సల్లూమ్, డాక్టర్ అలీ అల్ నుఐమీ, జైనాబ్ అబ్దుల్ అమీర్ మరియు మహమూద్ ఫర్దాన్ స ఈ ప్రతిపాదన సమర్పించారు. ఈ ముసాయిదా ప్రకారం, కోర్టు ఒకేసారి గరిష్టంగా మూడు నెలల ప్రయాణ నిషేధాన్ని విధించవచ్చు. దీనిని పలుమార్లు పునరుద్ధరించే అవకాశం ఉంది. మొత్తంగా గరిష్టంగా మూడేళ్ల వరకు నిషేధం పొడిగించవచ్చు.
ఈ ప్రతిపాదన లోన్ రికవరీ యంత్రాంగాలను బలోపేతం చేయడానికి మరియు పెద్ద కేసులలో విచారణకు న్యాయస్థానాలకు తగినంత సమయం ఉండేలా చూడటానికి ఈ సవరణ ఉపయోగపడుతుందని ఎంపీలు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- కువైట్‌లో T5 టెర్మినల్ పునఃప్రారంభం పై సోషల్ మీడియాలో వైరల్ వార్తలు ఫేక్: DGCA స్పష్టీకరణ
- IPL 2026: కోల్‌కతా పై చెన్నై ఘన విజయం
- దోహాలో ఘనంగా డా.బి.ఆర్.అంబేద్కర్ జయంతి వేడుకలు
- శంషాబాద్‌లో నకిలీ CISF అధికారి గుట్టురట్టు!
- ఏప్రిల్ 15 నుంచి కొత్త జరిమానా నిబంధనలు అమలు
- ట్రంప్‌తో 40 నిమిషాలు మాట్లాడిన ప్రధాని మోదీ..
- బిహార్ కొత్త సీఎం గా సామ్రాట్ చౌదరి..!
- భారత్ లో ‘టెక్నోవర్స్ హ్యాకథాన్ 2026’ ప్రారంభం!
- తెలంగాణలో వీఐపీ సెక్యూరిటీ తగ్గింపు: డీజీపీ శివధర్‌రెడ్డి
- ఛత్తీస్ గఢ్ లోని వేదాంత పవర్ ప్లాంట్‌లో భారీ పేలుడు, 9 మంది మృతి









