'కబాలి-2'కి సన్నద్ధమవుతున్న దర్శకుడు..
- August 05, 2016వసూళ్ల పరంగా బాక్సాఫీసు దగ్గర ప్రకంపనలు సృష్టించిన చిత్రం 'కబాలి'. చాలా రోజుల తర్వాత రజనీకాంత్ స్టామినాని గుర్తు చేసిన చిత్రంగానూ నిలిచింది. మొదట కథపై విమర్శకులు పెదవి విరిచినప్పటికీ వసూళ్ల పరంగా మాత్రం సినిమా దుమ్ము రేపింది. ఆ ఉత్సాహంలో దర్శకుడు పా.రంజిత్ 'కబాలి-2'కి సన్నద్ధమవుతున్నట్టు సమాచారం. రజనీకాంత్ కూడా అందుకు పచ్చజెండా వూపేశాడు. 'కబాలి' కథని కూడా సీక్వెల్‌కి అనుగుణంగానే ముగించారు. అంటే సినిమా సెట్స్‌పై ఉన్నప్పుడే రజనీ, పా.రంజిత్ మధ్య సీక్వెల్ గురించి చర్చ జరిగుంటుందని అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు సినిమా ఘన విజయం సాధించడంతో 'కబాలి2' ఖాయమేనని తమిళ సినీ వర్గాలు చెబుతున్నాయి. పా.రంజిత్ తదుపరి సూర్య కథానాయకుడిగా '5.35' అనే చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. ఆ చిత్రం తర్వాతే 'కబాలి2' సెట్స్‌పైకి వెళ్లొచ్చని తెలుస్తోంది.
తాజా వార్తలు
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్‌కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్‌పోర్టులో కలకలం
- తిరుమలలో రెండోరోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్‌పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసులు మృతి
- ఈ-స్కూటర్లకు ట్రాఫిక్ భద్రతా నియమాలు తప్పనిసరి
- దుబాయ్ నివాసితులు dh3000 అదనపు అద్దె చెల్లించాలా?
- మనామా చేరుకున్న HH సయ్యద్ అసద్