ప్రాంతీయ ఉద్రిక్తతలు, ఇంధన మార్కెట్ స్థిరత్వం పై ఖతార్ అమీర్–అమెరికా అధ్యక్షుడు ఫోన్ చర్చ
- April 16, 2026
దోహా: ప్రాంతంలో వేగంగా పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఖతార్ అమీర్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థాని మరియు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య నేడు కీలక టెలిఫోన్ సంభాషణ జరిగింది. ప్రాంతీయ, అంతర్జాతీయ తాజా పరిణామాలతో పాటు ఇంధన భద్రత అంశాలు ప్రధానంగా చర్చకు వచ్చినట్లు Qatar News Agency (QNA) వెల్లడించింది.
ఇటీవలి ఉద్రిక్తతల ప్రభావం అంతర్జాతీయ నావిగేషన్ భద్రత, ఇంధన మార్కెట్ల స్థిరత్వం, ప్రపంచ సరఫరా గొలుసులుపై ఎలా పడుతోందన్న అంశాన్ని ఇరువురు నేతలు సమీక్షించారు.
ఈ సందర్భంగా ఖతార్ అమీర్ మాట్లాడుతూ, ప్రాంతం మరింత ఉద్రిక్తతలకు గురికాకుండా అంతర్జాతీయ సమాజం ప్రయత్నాలను మరింత వేగవంతం చేయాల్సిన అవసరం ఉందని నొక్కిచెప్పారు. సంక్షోభాల పరిష్కారానికి దౌత్య మార్గాలనే ప్రధాన మార్గంగా అవలంబించాల్సిన అవసరం ఉందని, అదే ప్రాంతీయ మరియు ప్రపంచ శాంతి, స్థిరత్వాన్ని కాపాడుతుందని పేర్కొన్నారు.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా ఇంధన భద్రత, గ్లోబల్ మార్కెట్ల స్థిరత్వం వంటి కీలక అంశాలపై ఖతార్‌తో సమన్వయాన్ని కొనసాగించేందుకు అమెరికా ఆసక్తిగా ఉందని స్పష్టం చేశారు.
ప్రస్తుతం ప్రాంతీయ ఉద్రిక్తతల మధ్య ఈ ఫోన్ చర్చకు ప్రాధాన్యం పెరిగిందని, ముఖ్యంగా ఇంధన సరఫరాలు మరియు సముద్ర మార్గ భద్రత పరంగా ఖతార్–అమెరికా సమన్వయం కీలకంగా మారిందని విశ్లేషకులు భావిస్తున్నారు.
తాజా వార్తలు
- సచిన్ టెండూల్కర్ 53వ పుట్టినరోజు: ఫ్యాన్స్‌తో కలిసి వేడుకలు..
- మైక్రోసాఫ్ట్ ‘బైఅవుట్’ ఆఫర్
- ఏప్రిల్ 26 నుండి జజీరా ఎయిర్వేస్ నేరుగా విమాన సర్వీసులు ప్రారంభం
- యువ టెక్ మేధస్సుల కోసం 'టినీ టెక్నీస్-2కే26' టెక్నో స్కిల్స్ బూట్‌క్యాంప్
- SR 4 మిలియన్ల ఫైన్స్ వేసిన ఆరోగ్య బీమా మండలి..!!
- కువైట్ లో సామాజిక సమావేశాల పై నిషేధం ఎత్తివేత..!!
- షార్జాలోని అల్ ధైద్‌లో 13 టన్నుల పాడైన ఫుడ్ ధ్వంసం..!!
- విదేశాంగ మంత్రితో అమెరికా రాయబారి సమావేశం..!!
- అల్ సీబ్‌లో డ్రగ్ కలకలం..అరబ్ జాతీయుడు అరెస్టు..!!
- 'సింగిల్ విండో' సేవల సమయాలను ప్రకటించిన MoCI..!!









