వేగంగా షూటింగ్ జరుపుకుంటున్న'డిక్టేటర్'

- July 23, 2015 , by Maagulf
వేగంగా షూటింగ్ జరుపుకుంటున్న'డిక్టేటర్'

వచ్చే సంక్రాంతి బరిలో ఎవరెవరు దిగుతారనే విషయంలో ఇప్పటి నుండే ఆసక్తి నెలకొంది... ఎవరి సంగతి ఎలా ఉన్నా నందమూరి బాలకృష్ణ మాత్రం 'డిక్టేటర్'గా సంక్రాంతికి వస్తాడని తెలుస్తోంది. ఆ పండగను టార్గెట్ గా పెట్టుకునే దర్శకుడు శ్రీవాస్ ఈ సినిమా షెడ్యూల్స్ ను ప్లాన్ చేశాడని అంటున్నారు. ప్రస్తుతం 'డిక్టేటర్' షూటింగ్ నానక్ రామ్ గూడాలోని రామానాయుడు సినీ విలేజ్ లో వేసిన స్పెషల్ సెట్ లో జరుగుతోంది. బాలకృష్ణ, హీరోయిన్లు అంజలి, సోనాల్ చౌహాన్ తో పాటు ప్రధాన తారాగణమంతా ఇందులో పాల్గొంటోంది. దీని తర్వాత షెడ్యూల్ ను యూరప్ లో జరుపుబోతున్నారు. నందమూరి బాలకృష్ణ సినిమా సంక్రాంతి కానుకగా విడుదలైందంటే... విజయం ఖాయమనేది ఆయన అభిమానుల నమ్మకం. కొన్ని చిత్రాలు ఆశించిన స్థాయిలో ఆడకపోయినా... అత్యధిక శాతం చిత్రాలు ఈ సీజన్ లో ఘనవిజయాన్ని సొంతం చేసుకున్నాయి. 'భార్గవరాముడు', 'ఇన్ స్పెక్టర్ ప్రతాప్', 'వంశానికొక్కడు', పెద్దన్నయ్య', 'సమరసింహారెడ్డి, 'నరసింహనాయుడు', 'లక్ష్మీనరసింహా' చిత్రాలే అందుకు ఉదాహరణ! సో... అదే నమ్మకంతో ఈ సారి కూడా 'డిక్టేటర్'ను సంక్రాంతి బరిలోనే నిలపాలని దర్శకుడు శ్రీవాస్ భావిస్తున్నాడు. అలానే ఎరాస్ సంస్థ దక్షిణాదిన సినిమా నిర్మిస్తే... సక్సెస్ కాదనే సెంటిమెంట్ కూడా ఒకటి ఉంది. 'డిక్టేటర్'తో ఆ సెంటిమెంట్ కూడా చెరిగిపోతుందని, కొత్త సంవత్సరం ఈ సంస్థకు భారీ విజయం దక్కుతుందని నందమూరి అభిమానులు భావిస్తున్నారు... మరి ఏం జరుగుతుందో చూద్దాం!!                  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com