బాల దర్శకత్వంలో ముగ్గురు హీరోలతో జతకట్టనున్న అనుష్క
- August 05, 2016
మన సినిమాల్లో ఒక హీరో తో ముగ్గురు హీరోయిన్లు నటించడం కామనే..కానీ ఒక హీరొయిన్ తో ముగ్గురు హీరోలు నటించడం మాత్రం జరగలేదు. అయితే ఇప్పుడు అనుష్కతో ఏకంగా ముగ్గురు హీరోలు కలసి నటించబోతున్నారట.షాకింగ్ గా ఉంది కదూ!!..ఇంతకీ ఎవరా ముగ్గురు హీరోలు అనుకుంటున్నారా..వాళ్ళే రానా,ఆర్య,విశాల్ . ఈ ముగ్గురూ అనుష్కతో కలసి బాలా డైరెక్షన్ లో నటించడానికి రెడీ అవుతున్నారట.
శివపుత్రుడు, నేను దేవుణ్ణి , వాడు వీడు వంటి వైవిధ్యమైన సినిమాలతో తెలుగు ప్రేక్షకులకి పరిచయమయ్యాడు డైరెక్టర్ బాలా.సహజత్వానికి దగ్గరగా వుండే కథలతో వైవిధ్యమైన సినిమాలు తీసే బాలా డైరెక్షన్ లో నటించడానికి స్టార్లు కూడా రెడీగా వుంటారు.శివపుత్రుడులో విక్రమ్,సూర్య.. వాడు వీడులో ఆర్య,విశాల్ లు తమ అద్బుతమైన నటనతో ఆకట్టుకొని మంచి పేరు తెచ్చుకున్నారు.
ఇప్పుడు బాలా మరో వైవిధ్యమైన కధను సిద్దం చేసాడట..ఈ సినిమా కోసం అనుష్క,రానా,విశాల్,ఆర్య,అరవింద్ స్వామి నటించబోతున్నారట.ప్రస్తుతం బాలా పూర్తి స్క్రిప్టును రాసే పనిలో వున్నాడట. ఈ ఇయర్ ఎండ్ కి ఈ మూవీ స్టార్ట్ చేయబోతున్నాడట.
తాజా వార్తలు
- యూఏఈ: భారతీయ సంఘాల ప్రతినిధులతో భారత విదేశాంగ శాఖ కార్యదర్శి శ్రీప్రియ రంగనాథన్ భేటీ
- మహాత్మా గాంధీకి శ్రద్ధాంజలి అర్పించిన భారత విదేశాంగ శాఖ కార్యదర్శి శ్రీప్రియ రంగనాథన్
- సౌదీ అరేబియా పై హౌతీల బాలిస్టిక్ క్షిపణుల దాడి యత్నం..
- పరిస్థితులు ప్రతిభకు అడ్డంకులు కావు: గవర్నర్ శివప్రతాప్ శుక్లా
- భారత దేశవ్యాప్తంగా రేపు కాంగ్రెస్ నిరసనలు
- యూఏఈలో ఇరాన్ ఎయిర్లైన్స్ విమానాలు నిలిపివేత.. తదుపరి ఆదేశాల వరకు సస్పెన్షన్
- దుబాయ్ ఫౌంటెన్ షోలు పునఃప్రారంభం.. తగ్గిన శబ్దంతో ప్రదర్శనలు
- స్థానిక ఎన్నికల పై జగన్ ఫోకస్.. అభ్యర్థుల ఎంపిక పై కీలక ఆదేశాలు
- 476 మంది స్కూల్ బస్సు డ్రైవర్లు, సూపర్వైజర్లకు దుబాయ్ పోలీసుల శిక్షణ
- అల్ వుస్తా, సౌత్ అల్ షర్కియా గవర్నరేట్లలో సుల్తాన్ పర్యటన..!!







