ప్రవాసుల బ్యాంకు ఖాతాలపై కువైట్ పర్యవేక్షణ కఠినతరం..!!

- April 20, 2026 , by Maagulf
ప్రవాసుల బ్యాంకు ఖాతాలపై కువైట్ పర్యవేక్షణ కఠినతరం..!!

కువైట్: వర్క్ పర్మిట్ల గడువు ముగిసిన ప్రవాసుల బ్యాంకు ఖాతాలపై పర్యవేక్షణను కఠినతరం చేయాలని కువైట్ సెంట్రల్ బ్యాంక్ స్థానిక బ్యాంకులను ఆదేశించింది. ఈ మేరకు ఒక  సర్క్యులర్‌ జారీ చేసింది.  

చెల్లుబాటులో లేని పర్మిట్లు కలిగిన కార్మికుల సివిల్ ఐడి నంబర్లు మరియు పేర్లను బ్యాంకులకు అందించడానికి, పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్‌తో ఒక ఆటోమేటెడ్ లింక్‌ను ఏర్పాటు చేసినట్లు సెంట్రల్ బ్యాంక్ తెలిపింది.

కస్టమర్ డేటాను క్రమం తప్పకుండా అప్‌డేట్ చేయడానికి మరియు డీయాక్టివేట్ ఖాతాల దుర్వినియోగాన్ని నిరోధించడానికి బ్యాంకులకు సహాయపడటమే ఈ చర్య లక్ష్యమని పేర్కొన్నది.

కొన్ని బ్యాంకులకు గతంలో అటువంటి కస్టమర్ల గురించి తగినంత సమాచారం లేకపోవడం వల్ల, కొన్ని ఖాతాలు తెరిచి ఉండిపోయాయని.. ఇది ఫ్రాడ్ లేదా చట్టవిరుద్ధ లావాదేవీల ప్రమాదాలకు దారితీసిందని రెగ్యులేటర్ పేర్కొంది. బ్యాంకులు “నో యువర్ కస్టమర్” (KYC) అవసరాలను పాటించాలని మరియు ఈ ఖాతాలపై అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.

దేశ ఆర్థిక రంగంలో మనీలాండరింగ్ నిరోధక మరియు ఉగ్రవాద నిధుల నిరోధక నియంత్రణలను పటిష్టం చేయడానికి జరుగుతున్న నిరంతర ప్రయత్నాలలో ఈ చర్యలు ఒక భాగమని సర్క్యులర్ లో స్పష్టం చేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com