యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- April 20, 2026
అబూదాబి: యూఏఈ రాష్ట్ర భద్రతా విభాగం దేశ భద్రత, స్థిరత్వాన్ని దెబ్బతీయడానికి కుట్ర పన్నిన ఒక ఉగ్రవాద సంస్థను ఛేదించినట్లు ప్రకటించింది.ఈ సంస్థకు చెందిన సభ్యులను అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు.
దర్యాప్తులో భాగంగా, ఈ సంస్థ ఇరాన్‌కు చెందిన “విలాయత్ అల్-ఫకీహ్” సిద్ధాంతంతో సంబంధాలు కలిగి ఉన్నట్లు వెల్లడైంది.సభ్యులు తీవ్రవాద భావజాలాన్ని అనుసరించి, దేశీయ భద్రతకు ముప్పు కలిగించే చర్యలకు పాల్పడినట్లు గుర్తించారు.
గోప్య సమావేశాల ద్వారా యువతను తప్పుదారి పట్టించడం, విదేశీ శక్తులకు మద్దతు ఇవ్వించేలా ప్రేరేపించడం, దేశ ప్రతిష్టను దెబ్బతీయడానికి ప్రయత్నించడం వంటి చర్యలు ఈ సంస్థ చేపట్టినట్లు విచారణలో బయటపడింది. అదనంగా, అనధికార మార్గాల్లో నిధులను సేకరించి విదేశీ అనుమానాస్పద సంస్థలకు తరలించినట్లు అధికారులు తెలిపారు.
ఈ కేసులో సభ్యులపై రహస్య సంస్థ స్థాపన, దేశంలో కార్యకలాపాల నిర్వహణ, విదేశీ సంస్థలకు విధేయత ప్రకటించడం, జాతీయ ఐక్యత మరియు సామాజిక శాంతిని భంగం కలిగించడం వంటి ఆరోపణలు నమోదయ్యాయి.
దేశ భద్రతను కాపాడడంలో తమ కట్టుబాటును పునరుద్ఘాటించిన రాష్ట్ర భద్రతా విభాగం, అనుమానాస్పద కార్యకలాపాల పై పౌరులు మరియు నివాసితులు వెంటనే అధికారులకు సమాచారం అందించాలని పిలుపునిచ్చింది.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్‌లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









