కరీంనగర్‌లో గజానంద్స్ నాస్టిక్ ‘సహజ ఫ్రూట్ పాప్స్’ ప్రారంభం

- April 24, 2026 , by Maagulf
కరీంనగర్‌లో గజానంద్స్ నాస్టిక్ ‘సహజ ఫ్రూట్ పాప్స్’  ప్రారంభం

కరీంనగర్: కరీంనగర్ ప్రకృతి స్వచ్ఛతకు ప్రతీకగా, పూర్తిగా సహజమైన పండ్లతో తయారు చేసిన 'గజానంద్స్ నాస్టిక్' ఫ్రూట్ పాప్స్ విక్రయ కేంద్రాన్ని కరీంనగర్ నగరంలోని భగత్ నగర్, గోదాంగడ్డ రోడ్ (వరాహి బాంక్వెట్ హాల్ సమీపంలో) ఘనంగా ప్రారంభించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సూడా  చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి హాజరై, రిబ్బన్ కట్ చేసి షాపును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజల ఆరోగ్యానికి మేలు చేసేలా ఎటువంటి రసాయనాలు లేకుండా సహజ సిద్ధమైన పండ్లతో ఇక్కడ రకరకాల ఐస్‌క్రీమ్‌లు, ఫ్రూట్ పాప్స్ అందుబాటులోకి రావడం సంతోషకరమని అన్నారు. నగర వాసులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.షాప్ నిర్వాహకులు సాయినాధ్, సంపత్ మాట్లాడుతూ భాగస్వామ్యంతో ఈ నూతన కేంద్రాన్ని ఏర్పాటు చేశామని, నాణ్యతకు ప్రాధాన్యత ఇస్తూ వినియోగదారులకు మేలైన రుచులను అందిస్తామని తెలిపారు.ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో రవళి, వెంకటేష్, శ్రీమాన్, హరీష్, రమేష్, కిరణ్, రాజేశం, సందీప్, రాజమౌళి తదితరులు పాల్గొని నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com