విదేశాంగ మంత్రితో అమెరికా రాయబారి సమావేశం..!!

- April 24, 2026 , by Maagulf
విదేశాంగ మంత్రితో అమెరికా రాయబారి సమావేశం..!!

మనామా: బహ్రెయిన్ విదేశాంగ మంత్రి డాక్టర్ అబ్దుల్ లతీఫ్ బిన్ రషీద్ అల్ జయనీని బహ్రెయిన్ లోని అమెరికా రాయబారి  స్టెఫానీ హాలెట్‌ సమావేశమయ్యారు.  ఈ సందర్భంగా బహ్రెయిన, అమెరికా మధ్య ఉన్న చారిత్రక సంబంధాలు, వ్యూహాత్మక భాగస్వామ్యం, అలాగే వివిధ స్థాయిలలో అద్భుతమైన పురోగతిని సమీక్షించారు. అలాగే రెండు దేశాల ప్రజలకు మేలు, ప్రయోజనం చేకూర్చే విధంగా ఉమ్మడి ద్వైపాక్షిక సహకారం మరియు సమన్వయ అంశాలను పెంపొందించే మార్గాలపై ప్రత్యేకంగా చర్చించారు.

ప్రస్తుత భద్రతా మండలికి సమర్పించిన ప్రాంతీయ సమస్యలకు సంబంధించి, ఉమ్మడి సమన్వయం కోసం ఉన్న అవకాశాలపై చర్చించారు. అదేవిధంగా తాజా ప్రాంతీయ పరిణామాలతోపాటు ప్రాంతీయ భద్రత, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వాటి గురించి తమ అభిప్రాయాలను పంచుకున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com