షార్జాలోని అల్ ధైద్‌లో 13 టన్నుల పాడైన ఫుడ్ ధ్వంసం..!!

- April 24, 2026 , by Maagulf
షార్జాలోని అల్ ధైద్‌లో 13 టన్నుల పాడైన ఫుడ్ ధ్వంసం..!!

యూఏఈ: షార్జాలోని అల్ ధైద్ ప్రాంతంలో లైసెన్స్ లేని గోడౌన్ పై అధికారులు దాడి చేసి 13 టన్నులకు పైగా పాడైపోయిన ఆహార పదార్థాలను స్వాధీనం చేసుకుని ధ్వంసం చేశారు. అల్ ధైద్ నగర మునిసిపాలిటీలోని ప్రజారోగ్య శాఖలోని  ఆహార నియంత్రణ విభాగం నగరంలోని పారిశ్రామిక ప్రాంతంలో తనిఖీల సందర్భంగా ఈ చట్టవిరుద్ధ గోడౌన్ ను గుర్తించారు.  

అవసరమైన లైసెన్సులు లేకపోవడంతోపాటు ఆమోదించబడిన ఆరోగ్య, భద్రతా ప్రమాణాలను పాటించకుండా భారీ పరిమాణంలో ఆహార పదార్థాలు నిల్వ ఉన్నట్లు ఇన్‌స్పెక్టర్లు కనుగొన్నారు.   13 టన్నుల 170 కిలోగ్రాముల పాడైన ఆహార ఉత్పత్తులను స్వాధీనం చేసుకుని, అనంతరం ధ్వంసం చేశారు. ఆహార సంస్థలు మరియు గోడౌన్లు ఆరోగ్య నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని అధికారులు సూచించారు. రెగ్యులర్ చెకింగ్స్ తోపాటు కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com