'బేతాళుడు'గా వస్తోన్న సైతాన్ : 'విజయ్ ఆంటోని'...

- August 06, 2016 , by Maagulf
'బేతాళుడు'గా వస్తోన్న సైతాన్ : 'విజయ్ ఆంటోని'...

నాన్నకు ప్రేమతో.. ఈ ఏడాది ప్రారంభంలో టాలీవుడ్ బాక్సాఫీస్ ని కళకళలాండిచిన సినిమా. ఎన్నెన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ మూవీ.. టఫ్ కాంపిటీషన్ మధ్య వచ్చినా సూపర్బ్ గా పెర్ఫామ్ చేసింది. 52 కోట్ల కలెక్షన్స్ రాబట్టేసి.. ఎన్టీఆర్ కి- సుకుమార్ కి మరిచిపోలేని విజయం అందించింది.  వీళ్లిద్దరికీ కెరీర్ బిగ్గెస్ట్ మూవీ ఇదేనంటే.. నాన్నకు ప్రేమతో సాధించిన విజయం అర్ధమవుతుంది. మొన్న 'డా:సలీం' గా  పలకరించి, నిన్న 'బిచ్చగాడు' గా రెండు తెలుగు రాష్ట్రాల  ప్రేక్షకులను అలరించిన హీరో 'విజయ్ ఆంటోని'. ఆయన నటించిన 'బిచ్చగాడు' ఘన విజయం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో 'విజయ్ ఆంటోని' కధానాయకునిగా తమిళంలో రూపొందుతున్న 'సైతాన్' చిత్రం పై అటు తమిళనాట,ఇటు తెలుగునాట  సినీ, ప్రేక్షక వర్గాలలో ఆసక్తి మరింత పెరుగుతోంది. ఇప్పుడీ చిత్రం తెలుగు ప్రేక్షకులను 'బేతాళుడు' గా పలకరించబోతోంది. 'బేతాళుడు'  చిత్రం తెలుగు నాట ప్రదర్శన హక్కులను 'విన్.విన్.విన్. క్రియేషన్స్' సంస్థ నిర్మాత ఎస్.వేణుగోపాల్ ('క్రియేటివ్ దర్శకుడు కృష్ణవంశీ 'సందీప్ కిషన్, రెజీనా' జంటగా రూపొందిస్తున్న'నక్షత్రం' చిత్ర నిర్మాతలలో ఈయన ఒకరు) చేజిక్కించుకున్న విషయం పాఠకులకు విదితమే. ఆయన మాట్లాడుతూ... 'బేతాళుడు' చిత్రం షూటింగ్ కార్యక్రమాలు పూర్తయ్యాయి.ప్రస్తుతం చిత్రం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ నెలలోనే 'బేతాళుడు' తొలి ప్రచార దృశ్యాలను, చిత్రం ఆడియోను విడుదల చేయనున్నాము.  సెప్టెంబర్ నెలలో తెలుగు,తమిళంలో చిత్రం ఒకే మారు విడుదలకు సన్నాహాలు జరుగుతున్నాయి అని తెలిపారు. 'మానస్ రిషి ఎంటర్ ప్రైజస్' సంస్థ తో కలసి ఈ 'బేతాళుడు' చిత్రాన్నితెలుగునాట తమ  'విన్.విన్.విన్. క్రియేషన్స్' సంస్థ విడుదల చేయనుందని నిర్మాత ఎస్.వేణుగోపాల్ తెలిపారు. చిత్ర కథానాయకుడు 'విజయ్ ఆంటోని' మాట్లాడుతూ..' నటునిగా వైవిధ్యమైన పాత్రల పోషణ లక్ష్యం గా  ఉన్న నాకు కొనసాగింపు ఈ 'సైతాన్'. 'సైకలాజికల్ సస్పెన్స్ థ్రిల్లర్' ఈ చిత్రం. తెలుగునాట 'బేతాళుడు' పేరుతొ విడుదల అవుతోంది చిత్రం.సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా ఈ చిత్రంలో నా పాత్ర గత చిత్రాలకు పూర్తి భిన్నమైనదిగా ఉండటంతో పాటు, వైవిధ్యాన్ని సంతరించుకుని ఉంటుంది. నా సరసన 'అరుంధతి నాయర్' నాయికగా నటిస్తున్నారు. చిత్ర దర్శకుడు 'ప్రదీప్ కుమార్' ఈ చిత్రం ప్రేక్షకులను పూర్తిస్థాయిలో అలరించేలా తీర్చిదిద్దుతున్నారని నమ్ముతున్నాను. 'ప్రదీప్ కలపురయల్' సినిమాటోగ్రఫీ ఓ ఎస్సెట్ ఈ చిత్రానికి. 'సైతాన్' కు సంగీతం నేనే. పాటలు,నేపధ్య సంగీతం ప్రేక్షకులను అలరిస్తాయని ఆశిస్తున్నాను. 'బిచ్చగాడు' విజయం తరువాత విడుదల అవుతున్న 'సైతాన్' చిత్రం పై సహజంగా అంచనాలు అధికంగానే ఉంటాయి. వాటికి తగిన స్థాయిలోనే ఈ చిత్రం ఉంటుందని తెలిపారు చిత్ర కథానాయకుడు 'విజయ్ ఆంటోని'. తెలుగునాట నటునిగా తనకు ఈ చిత్రం మరింత ఉన్నత స్థాయికి తీసుకు వెళుతుందని ఆశిస్తున్నాను అన్నారు 'విజయ్ ఆంటోని,,అరుంధతినాయర్ జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: విజయ్ ఆంటోని, సినిమాటోగ్రఫీ: ప్రదీప్ కలిపురయత్,ఎడిటర్; వీర సెంథిల్, ఫైట్స్: శరవణన్, ఆర్ట్: శక్తి వెంకట్ రాజ్. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com