ఎంసెట్-2 రాసిన వారంతా సెంసెట్-3 రాసేందుకు అర్హులే..
- August 06, 2016
సెప్టెంబరు 11న జరగనున్న తెలంగాణ ఎంసెట్-3 పరీక్షకోసం కొత్త హాల్టికెట్లు జారీ చేయాలని నిర్వహణ కమిటీ నిర్ణయించింది. ఎంసెట్-2 రాసిన వారంతా సెంసెట్-3 రాసేందుకు అర్హులేనని, పాత రిజిస్ట్రేషన్ల సంఖ్య ఆధారంగానే హాల్టికెట్లు ఇస్తామని కన్వీనర్ యాదయ్య తెలిపారు. హాల్టికెట్ సంఖ్య, పరీక్షా కేంద్రాలు మారతాయని చెప్పారు. కొత్త హాల్ టికెట్లను సెప్టెంబరు 3 నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని ఎంసెట్-3 కన్వీనర్ యాదయ్య తెలిపారు. ఎంసెట్-3 నిర్వహణ కమిటీ ఇవాళ కూకట్పల్లిలోని జేఎన్టీయూహెచ్లో సమావేశమై పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఎంసెట్-3 విధివిధానాలు, పూర్తి షెడ్యూల్ వివరాలతో ఈనెల 8న నోటిఫికేషన్ జారీ చేయాలని నిర్ణయించింది. రెండు మూడు రోజుల్లో ఎంసెట్-3 వెబ్సైట్ను విద్యార్థులకు అందుబాటులోకి తెస్తామని కన్వీనర్ తెలిపారు. బయోమెట్రిక్ ఇతర నిబంధనలు గతంలో మాదిరిగానే ఉంటాయని వివరించారు.
తాజా వార్తలు
- శాంతియుత అణుశక్తి వినియోగం పై అమెరికా–సౌదీ మధ్య కీలక ఒప్పందం
- WTC ఫైనల్-2027 వేదిక, తేదీలు ఖరారు
- యూఏఈలో భారతీయ పాస్పోర్ట్ దరఖాస్తుదారులకు కొత్త హెచ్చరిక..
- ఇన్ఫోసిస్ కొత్త సీఈవోగా ఆశిష్ కుమార్ దాష్
- సిక్కిం ఘటనపై భారత్కు బహ్రెయిన్ సంఘీభావం..!!
- OMR32,000 కారు రిప్లేస్.. న్యాయం చేసిన ఒమన్ CPA..!!
- కువైట్లో భారత పాస్పోర్ట్, వీసా, కాన్సులర్ సేవలు పునఃప్రారంభం..!!
- ఖతార్లో భారత రాయబారి విపుల్కు ఘనంగా వీడ్కోలు..!!
- దుబాయ్ ఇన్వైట్.. Dh3,000 రివార్డులు.. ఎలా పొందాలి?
- ఏపీకి కేంద్రం బంపర్ నజరానా







