1000 కోట్ల నిధులు విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం!
- April 29, 2026
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో పదవీ విరమణ చేసిన ఉద్యోగుల సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. గత కొంతకాలంగా పెండింగ్‌లో ఉన్న రిటైర్డ్ ఉద్యోగుల జనరల్ ప్రావిడెంట్ ఫండ్ (GPF) బకాయిలను చెల్లించేందుకు ప్రభుత్వం రూ.1,000 కోట్ల నిధులను విడుదల చేసింది. 2025 అక్టోబర్ వరకు పేరుకుపోయిన అన్ని బకాయిలను ఒకేసారి క్లియర్ చేస్తూ రాష్ట్ర ఆర్థిక శాఖ కీలక ఉత్తర్వులు జారీ చేసింది.
రిటైర్డ్ ఉద్యోగుల బకాయిల చెల్లింపులో జరుగుతున్న జాప్యంపై ఇటీవల గౌరవ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తక్షణమే స్పందించి నిధులను కేటాయించింది. ఈ నిర్ణయంతో వేలాది మంది రిటైర్డ్ ఉద్యోగులకు ఆర్థిక వెసులుబాటు కలగనుంది.
చెల్లింపుల పరిమితి పెంపు
భవిష్యత్తులో ఉద్యోగుల క్లెయిమ్‌లు, బిల్లులు పెండింగ్‌లో ఉండకుండా ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతి నెలా చేసే చెల్లింపుల పరిమితిని అదనంగా మరో రూ. 1,000 కోట్లకు పెంచుతూ ఆర్థిక శాఖ నిర్ణయించింది. దీనివల్ల ఇకపై రిటైర్మెంట్ బెనిఫిట్స్, మెడికల్ బిల్లులు, ఇతర క్లెయిమ్‌లు ఎప్పటికప్పుడు పరిష్కారమయ్యే అవకాశం ఉంది. ఈ నిర్ణయంతో ఉద్యోగ విరమణ చేసిన వారిలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ తాజా చర్యలతో బిల్లుల చెల్లింపు ప్రక్రియ మరింత వేగవంతం కానుంది.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







