పర్యావరణ అసమతుల్యంతో ఎండ తీవ్రత
- May 01, 2026
ప్రస్తుతం ఎండాకాలం ప్రారంభ దశలోనే తీవ్రమైన వేడితోపాటు వడ గాలులు అధికమవుతున్నాయి.ఈ క్రమంలో కాలాలకు అనుగుణంగా భూగోళంపై అనేక వాతావరణ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా వేసవి కాలంలో నిరంతరం ఉండే వేడికన్నా అత్యధిక ఉష్ణో గ్రతలు గణనీయంగా నమోదు కావటం ప్రజలను ఉక్కిరి బిక్కిరి చేసే విధంగా వీస్తున్న వడ గాలులతో ఇంట్లో నుండి బయటకు రావడానికి సంకోచించవలసిన పరిస్థితులు ఏర్ప డుతున్నాయి. సూర్యుడి నుండి భూమి గ్రహించిన అధిక వేడిని తిరిగి భూతలం నుండి పైకి వెళ్లకుండా వేడి త్వరగా చల్లగా కాకుండా మోతాదుకు మించి భూ వాతావరణంలోకి అధికంగా విడుదలవుతున్నకార్బన్ డయాక్సైడ్ లాంటి విష వాయువులు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఈ క్రమం లో భూ ఉపరితలం వాతావరణం అత్యధిక ఉష్ణోగ్రతలు కలిగి ఉండటం వల్ల మానవులు తట్టుకునే ఉష్ణోగ్రత కంటే అధికమైన ఉష్ణోగ్రతలు నమోదై తీవ్రమైన గ్లోబల్ వార్మింగ్ ప్రభావం ఏర్పడి అనేక ప్రమాదాలకు కారణం అవుతున్నా యి. దీనికి ప్రధానంగా మానవుడు భూగోళం మీద పర్యా వరణ పరిరక్షణపై మరింత శ్రద్ధ తీసుకోకపోవడమే అనిపి స్తుంది.
భూ వాతావరణంలో సహజంగా ఉండే వివిధ వాయువుల నిష్పత్తి కంటే భూమి పై మరింతగా కలుషిత వాయువులు ఎక్కువవుతున్నాయి. దీనికి ప్రధానంగామానవ అవసరాలకు ఉపయోగిస్తున్న మోతాదుకు మించిన ఇంధ నాలు వాడకం, మితిమీరిన పారిశ్రామికీకరణ, కార్బన్డయా క్సైడ్, విషవాయువును స్వీకరించి స్వచ్ఛమైన ఆక్సిజన్ ను విడుదల చేసే పర్యావరణ పరిరక్షణకు అవసరమైన వృక్ష సంపదను సమృద్ధిగా పెంచుకోలేకపోవడం, ఆటవిక ప్రాంతం తరిగిపోతుండడం వంటి అంశాలపై మానవులు నిర్లక్ష్యధోరణి కలిగి ఉండడంవల్ల అధికంగా విషపూరిత వాయువ్యర్థాలతో వాతావరణం కలుషితం అవుతూ పర్యావరణంపై తీవ్ర ప్రభావం పడుతుంది. ఇటీవల వాతావరణ శాఖ విశ్లేషకులు సూచనలు గమనిస్తే రాబోయే సమీప కాలంలో సూపర్ ఎల్నినో వచ్చే అవకాశం లేకపోలేదని వార్తలు వినిపిస్తున్నాయి. అంటే భూమి వేడెక్కడం, అధిక వేడి గాలులు రావడమ కాకుండా ఉష్ణోగ్రతలు గణనీయంగా నమోదు అవుతాయని అంచనా వేస్తున్నారు. ఒకవేళ ఆ పరిస్థితి సంభవిస్తే కరవు కాటకాల వంటి పరిస్థితి ఎదురు కావచ్చుఏమో. ఎండ తీవ్రత వల్ల కూడా భూగర్భ జలాలు అడుగంటి పోవడం వల్ల బావుల్లో, బోర్లలో, చెరువుల్లో, కుంటల్లో నీరు తగినంత లేకపోవడంతో త్రాగు నీటి కరవుతోపాటు వ్యవసాయానికి నీరు లేకపోవడం, పంటలు పండకపోవడం ఇలాంటి అనేక సమస్యలు మానవ సమాజంపై తీవ్రమైన ప్రభావాన్ని చూపే అవకాశం లేకపోలేదు.
కొంతమంది స్వార్ధ పూరిత స్వప్రయోజనాల కొరకు యధేచ్ఛగా ప్రకృతి వనరు లను నాశనం చేస్తూ పర్యావరణ వినాశనానికి కారణం అవు తుండడం వల్లే వాతావరణంలో అసాధారణ పరిస్థితులు ఏర్పడుతూ అధిక ఎండ తీవ్రతలతో జనజీవనం అస్తవ్యస్త వం కావడం సర్వసాధారణం అవుతున్నదని అనిపిస్తుంది. కొన్నిసార్లు మానవులు ఎండ తీవ్రతను తట్టుకోలేక ప్రాణా పాయ స్థితిలో పడిపోతుంటారు. బయట సంచరించే గూడు లేని మూగ జీవాలు జంతువులు, పక్షులు సైతం తీవ్రమైన ఎండ తాకిడికి అల్లాడిపోతున్నాయేమో. మానవాళి తన చుట్టూ ఉన్న పరిసరాల్లో సమతుల్యమైన పర్యావరణంకోసం వృక్ష సంపదను తగినంతగా పెంచుకోలేకపోవడం, ఇష్టాను సారంగా మోతాదుకు మించిన ఇంధనాల వాడకం దీనివల్ల గ్లోబల్ వార్మింగ్ అధికమై వాతావరణ సమతుల్యత లోపిం చడం వల్ల తీవ్రమైన ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయని అర్థం చేసుకోవాల్సిన అవసరం మానవ సమాజానికి ఉండాల్సిందే. స్వప్రయోజనాల కొరకు కావచ్చు మానవ అవసరాలకు కావచ్చు వృక్షాలను ఉపయోగించుకునే రీతిలో మానవాళి మరల సరిపడా వృక్షాలు పెంచకపోవడం వల్ల తరుచుగా వాతావరణ పర్యావరణ సమస్యలు ఏర్పడుతు న్నాయి.
కానీ ప్రస్తుతం ఆధునిక నాగరికత ప్రపంచంలో మానవుని అవసరాలు సులభతరం చేసుకునే రీతిలోమానవ మేధస్సు ప్రకృతికి సమాంతరంగా కృత్రిమ వాతావరణ యంత్రాలను సృషస్తున్నప్పటికీ, ఇలాంటివన్నీ కూడా సరైన పద్ధతుల్లో వాడినప్పుడు మాత్రమే ప్రయోజనం ఉంటుంది. లేకుంటే వాటి నుండి వచ్చేటువంటి విషతుల్యమైన వాయు వ్యర్ధాలు వాతావరణంలో కలిసిపోయి దుష్ప్రభావాన్ని చూపెడుతూ మానవ మనుగడకే ఇబ్బందికరంగా మారే అవకాశం లేకపోలేదు. పట్టణాలు నగరాలలో జన సాంద్రత కూడా అధికం కావడం అవసరాలకు అత్యధిక ఇంధన వాహనాల ను ఉపయోగించడం అందులో నుండి వచ్చేటువంటి కార్బన్ డయాక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్ లాంటి విషవాయువులు మోతాదుకు మించి వాతావరణంలో కలిసిపోవడం ఒక ఎత్తు అయితే కృత్రిమ యంత్ర పరికరాలు అయినా ఎయిర్ కండిషన్స్, రిఫ్రిజిరేటర్లు, కోల్డ్ స్టోరేజ్లవాడకం అందులో నుండి తరచుగా వెలువడుతున్న క్లోరోఫ్లోరో కార్బన్లు, హైడ్రో ఫ్లోరో కార్బన్లు వంటి విషతుల్యమైన వాయు పదార్థాలు వాతా వరణంలోని ఓజోన్పొరను దెబ్బతీస్తున్నాయి. తద్వారా విభిన్న ప్రాంతాల్లో ఎండ తీవ్రతలో వ్యత్యాసం గోచరిస్తుంది.
ఏదిఏమైనప్పటికీ అధునాతనమైన పద్ధతుల ద్వారా మానవుడు తన అవసరాలను సులభతరం చేసుకునే రీతిలో అనుసరిస్తున్న విధానాలతోపాటు జనసాంద్రత పెరిగిపోతు న్న పట్టణ నాగరిక అభివృద్ధిలో తరచుగా పర్యావరణ సమస్యలు ఏర్పడుతున్నాయి. అభివృద్ధి చెందుతున్న ఆధునిక టెక్నాలజీతో సమాంతరంగా పర్యావరణానికి కూడా హాని కలుగకుండా వాతావరణాన్ని పరిరక్షించుకునే విధానాలు మానవుడు అవలంబించగలగాలి. లేకుంటే అత్యధికంగా ఎండ తీవ్రతతో వచ్చే ఉపద్రవాలు మానవాళికి తీవ్ర నష్టం కలిగించడమే కాకుండా మానవుడు ప్రకృతిలో చేసేటువంటి వ్యతిరేక కార్యకలాపాలు మానవజాతి ఒక మచ్చగా మిగిలి పోతాయి. తద్వారా భూగోళంపై జీవకోటి అస్తవ్యస్తమైపోయే ప్రమాదం లేకపోలేదు. ఎండ తీవ్రతవల్ల మానవులతో పాటు సహజంగా భూమిపై సంచరించే పక్షులు జంతుజాతి అంత రించిపోయే అవకాశం లేకపోలేదు. పరిసరాలు చుట్టూ సమ తుల్యమైన పర్యావరణం కొరకు అవసరమైన చోట ప్రకృతి వనాలను సమృద్ధిగా పెంచుకునేందుకు ప్రతిఒక్కరు మరింత భాగస్వాములు కావాలి. ఈక్రమంలో ఇకనైనా మానవులు ప్రత్యక్షంగా పరోక్షంగా పర్యావరణానికి నష్టం కలిగించే విధా నాలకు స్వస్తిపలికి పర్యావరణ పరిరక్షణకు మరింత తోడ్పా టును అందించవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంటుందేమో.
తాజా వార్తలు
- ఐరా ‘స్పా’ మసాజ్ సెంటర్ లో వ్యభిచారం.. నలుగురు అరెస్ట్!
- బసవతారకం హాస్పిటల్: ఏపీ వాసులకు శుభవార్త..
- మల్కాజిగిరి పోలీస్ కమిషనర్గా బి.సుమతి బాధ్యతల స్వీకరణ
- కార్పొరేట్ ట్యాక్స్ బిల్లులో లోపాలను ఎత్తిచూపిన పార్లమెంట్ ప్యానెల్..!!
- 3 గంటల రెస్క్యూ..మహిళను రక్షించిన యూఏఈ హైకర్..!!
- 2026 Q1లో సౌదీ GDP 2.8% వృద్ధి..!!
- ట్రావెల్, ఎయిర్ కార్గో ఏజెన్సీలపై QCAA కఠిన చర్యలు..!!
- ప్రపంచ పత్రికా స్వేచ్ఛ సూచిక..ఒమన్ 7 స్థానాలు మెరుగు..!!
- కువైట్ లో జూన్ 30 వరకు కార్మికుల బదిలీలు..!!
- ఈ ఆదివారం నుంచి జజీరా ఎయిర్వేస్ పూర్తిస్థాయి సేవలు పునఃప్రారంభం









