కువైట్ లో జూన్ 30 వరకు కార్మికుల బదిలీలు..!!
- May 01, 2026
కువైట్: కువైట్‌లోని పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్‌పవర్ కొన్ని నియంత్రిత రంగాలలో నియమించబడిన కార్మికులను ఇతర రంగాలకు బదిలీ చేయడానికి అనుమతించనున్నారు. ఇది నేటి నుండి అమల్లోకి వచ్చిందని జూన్ 30 వరకు బదిలీలకు అనుమతి ఉంటుందని ప్రకటించారు.
ఈ ఉత్తర్వుల నుండి ప్రయోజనం పొందడానికి దరఖాస్తులను కంపెనీల కోసం కేటాయించిన “అస్ హాల్” సర్వీస్ ద్వారా సమర్పించాలని అధికార సంస్థ తెలిపింది. బదిలీ అభ్యర్థనలను అంగీకరించడానికి మరియు అవసరమైన ప్రక్రియలను పూర్తి చేయడానికి అసలు యజమాని నుండి ఆమోదం పొందడం తప్పనిసరి అని తెలిపింది.
ఈ ఉత్తర్వుల పరిధిలోకి వచ్చే రంగాలలో చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమలు, పరిశ్రమ, వ్యవసాయం, పశుపోషణ మరియు మత్స్య పరిశ్రమ ఉన్నాయని ప్రకటించారు. మారుతున్న కార్మిక మార్కెట్ డిమాండ్లకు అనుగుణంగా యజమానులు మరియు కార్మికుల మధ్య సంబంధాన్ని నిర్ధారించడం లక్ష్యంగా తీసుకున్న ఒక నియంత్రణ చర్యగా ఈ ఉత్తర్వులను భావిస్తున్నారు.
తాజా వార్తలు
- ఐరా ‘స్పా’ మసాజ్ సెంటర్ లో వ్యభిచారం.. నలుగురు అరెస్ట్!
- బసవతారకం హాస్పిటల్: ఏపీ వాసులకు శుభవార్త..
- మల్కాజిగిరి పోలీస్ కమిషనర్‌గా బి.సుమతి బాధ్యతల స్వీకరణ
- కార్పొరేట్ ట్యాక్స్ బిల్లులో లోపాలను ఎత్తిచూపిన పార్లమెంట్ ప్యానెల్..!!
- 3 గంటల రెస్క్యూ..మహిళను రక్షించిన యూఏఈ హైకర్..!!
- 2026 Q1లో సౌదీ GDP 2.8% వృద్ధి..!!
- ట్రావెల్, ఎయిర్ కార్గో ఏజెన్సీలపై QCAA కఠిన చర్యలు..!!
- ప్రపంచ పత్రికా స్వేచ్ఛ సూచిక..ఒమన్ 7 స్థానాలు మెరుగు..!!
- కువైట్ లో జూన్ 30 వరకు కార్మికుల బదిలీలు..!!
- ఈ ఆదివారం నుంచి జజీరా ఎయిర్వేస్ పూర్తిస్థాయి సేవలు పునఃప్రారంభం









