చందానగర్‌లో భారీ అగ్నిప్రమాదం
- August 07, 2016
నగరంలోని చందానగర్‌లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఐదంతస్తుల భవనంలో శనివారం విద్యుదాఘాతంతో మంటలు చెలరేగాయి. ఫలితంగా నల్లటి పొగలు నాలుగు కిలోమీటర్ల మేర వ్యాపించి.. జాతీయ రహదారిపై దారి కనిపించక పెద్దఎత్తున వాహనాలు ఆగిపోయాయి.ఎనిమిది అగ్నిమాపక వాహనాలు, నాలుగు ప్రయివేటు ట్యాంకర్లు, మూడు జలమండలి ట్యాంకర్లతో నీళ్లు చల్లించడంతో ఆరు గంటల తర్వాత మంటలు అదుపులోకి వచ్చాయి. కాగా, ఆస్తి నష్టం లక్షల్లోనే ఉంటుందని అంచనా వేస్తున్నారు.శనివారం ఉదయం 11 గంటలకు భవనంలోంచి అకస్మాత్తుగా మంటలు ఎగసిపడ్డాయి. సమాచారం అందడంలో పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది చేరుకుని ప్రాథమికంగా మంటలను అదుపు చేశారు. కానీ కొద్దిసేపటికి ఉద్ధృతమై దట్టమైన పొగలు వ్యాపించాయి. దీంతో శ్వాస పీల్చుకునేందుకూ స్థానికులు ఇబ్బందులు పడ్డారు.
అగ్ని ప్రమాదం
కాగా, షోరూం తెరవకమునుపే విద్యుదాఘాతం చోటు చేసుకుంది. తక్కువ స్థలంలో అయిదంతస్తులు నిర్మించడంతో పాటు వెంటిలేషన్ లేకుండా ఉంది.
అగ్ని ప్రమాదం
ప్రధాన ద్వారం షెట్టర్ రిమోట్ సాయంతో పని చేస్తుంది. జనరేటర్ వేసి భారీ షట్టర్ లేపడానికి సిబ్బంది ప్రయత్నించలేదు.
అగ్ని ప్రమాదం
మంటలు అదుపు చేయడానికి నేరుగా నీళ్లు చిమ్మడానికి ఆస్కారం లేకుండా పోయింది. పొగలు, మంటలతో వేడి పెరిగి భవనం గోడలపై ఒత్తిడి పెరిగింది.
అగ్ని ప్రమాదం
భవనం కింద నుంచి పైవరకు పూర్తిగా బీటలు వారాయి. ఆ పగుళ్ల మధ్యలోంచి పొగలు బయటకు వచ్చాయి. మరోవైపు భవన నిర్మాణ అనుమతులు, అగ్నిమాపక శాఖ నిబంధనల వివరాలపై అధికారులు ఆరా తీస్తున్నారు.
తాజా వార్తలు
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్‌లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్‌లో భారతీయ పాస్‌పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్‌లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!







