నూతన చేనేత విధానo తీసుకురానున్నట్లు కేటీఆర్‌ వెల్లడి..

- August 07, 2016 , by Maagulf
నూతన చేనేత విధానo తీసుకురానున్నట్లు  కేటీఆర్‌ వెల్లడి..

 టెక్స్‌టైల్‌ రంగంతో ప్రమేయం లేకుండా త్వరలోనే నూతన చేనేత విధానాన్ని తీసుకురానున్నట్లు తెలంగాణ మంత్రి కేటీఆర్‌ వెల్లడించారు. చేనేత ఉత్పత్తులకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకొస్తున్న కార్మికుల కోసం ప్రభుత్వం అన్ని రకాలు ప్రోత్సాహకాలు అందిస్తోందని పేర్కొన్నారు. జాతీయ చేనేత దినోత్సవాలన్ని పురస్కరించుకుని హైదరాబాద్‌ రవీంద్రభారతిలో ఏర్పాటుచేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కేటీఆర్‌... చేనేత కార్మికుల సంక్షేమం కోసం తీసుకొచ్చిన 'చేనేత లక్ష్మి' పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన పలువురు చేనేత కార్మికులను ఘనంగా సన్మానించారు. చేనేత వస్త్రాలతో నిర్వహించిన ఫ్యాషన్‌ షో ఆకట్టుకుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com