తెలంగాణ.. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ముందడుగు వేస్తోంది..

- August 07, 2016 , by Maagulf
తెలంగాణ.. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ముందడుగు వేస్తోంది..

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం తొలిసారిగా ఇక్కడకు రావడం ఎంతో సంతోషంగా వుందని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. గజ్వేల్‌ మండలం కోమటిబండలో జరిగిన సభలో ఆయన ప్రసంగించారు. మొదట తెలుగులో మాట్లాడుతూ తెలంగాణకు రావడం ఎంతో సంతోషంగా వుందన్నారు.* తెలంగాణ ప్రజల ఆశయాలు, ఆకాంక్షలు నెరవేర్చేందుకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుంది. * సమాఖ్య వ్యవస్థలో భాగంగా కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం కలిసి పనిచేస్తాయి. * నీరు, విద్యుత్‌, రహదారులు... తదితర సౌకర్యాలపై ప్రభుత్వం దృష్టి సారించడం అభినందనీయం. * దేశంలో కొత్త రాష్ట్రమైన తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలి. * దేశంలోనే అత్యంత పిన్న వయసున్న రాష్ట్రం తెలంగాణ.. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ముందడుగు వేస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com