'మిషన్ భగీరథ'ను ప్రారంభించిన మోదీ
- August 07, 2016
ప్రతి ఇంటికీ తాగునీరు అందించే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ తొలి యూనిట్‌ను ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రారంభించారు. మెదక్ జిల్లా గజ్వేల్ మండలం కోమటిబండ గ్రామంలో ఏర్పాటుచేసిన ట్యాంకులను మోదీ ప్రారంభించారు. గజ్వేల్ నియోజకవర్గంలోని 234 గ్రామాలకు తొలిదశగా నీరందించేలా వీటిని ఏర్పాటు చేశారు.మిషన్ భగీరథను ప్రారంభించిన అనంతరం అక్కడ ఏర్పాటుచేసిన ఛాయాచిత్ర ప్రదర్శనను మోదీ తిలకించారు.
అనంతరం రామగుండంలోని 1600 మెగావాట్ల ఎన్టీసీపీ థర్మల్ విద్యుత్ కేంద్రం, ఎరువుల కర్మాగారం పునరుద్ధరణ, మనోహరాబాద్-కొత్తపల్లి రైల్వేలైన్ శంకుస్థాపన శిలాఫలకాలను ప్రధాని ఆవిష్కరించారు. వరంగల్‌లోని కాళొజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం ప్రారంభం, ఆదిలాబాద్ జిల్లా జైపూర్‌లోని సింగరేణి 1200 మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రం జాతికి అంకితం చేసే శిలాఫలకాలను మోదీ ఆవిష్కరించారు.
అంతకుముందు హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో కోమటిబండ చేరుకున్న ప్రధానికి ప్రజాప్రతినిధులు పుష్ఫగుచ్ఛాలతో ఘనస్వాగతం పలికారు. మోదీ వెంట గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి కేసీఆర్, కేంద్రమంత్రులు వెంకయ్యనాయుడు, బండారు దత్తాత్రేయ, అనంతకుమార్, పీయూష్ గోయల్, పలువురు రాష్ట్ర మంత్రులు ఉన్నారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో పోలీసులు నిఘా పటిష్టం చేశారు. మొత్తం 40 సీసీ కెమెరాల ద్వారా భద్రతను పర్యవేక్షిస్తున్నారు.
తాజా వార్తలు
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్‌పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!







