కళ్యాణ్ రామ్, సాయిధరమ్ తేజ్ కాంబినేషన్‌లో

- August 07, 2016 , by Maagulf
కళ్యాణ్ రామ్, సాయిధరమ్ తేజ్ కాంబినేషన్‌లో

నందమూరి.. మెగా హీరోల తొలి కలయికతో ఓ మల్టీస్టారర్ స్టార్ట్ కాబోతోంది. కళ్యాణ్ రామ్, సాయిధరమ్ తేజ్ కాంబినేషన్‌లో రానున్న ఈ మూవీని ఏ.ఎస్.రవికుమార్ డైరెక్ట్ చేయనున్నాడు. ఈ కాంబినేషన్‌ని సెట్ చేసింది కల్యాణ్ రామేనని సమాచారం. డైరెక్టర్ రవికుమార్ ఇటీవల కళ్యాణ్ రామ్‌కి ఓ స్టోరీ చెప్పగా.. అది బాగా నచ్చడంతో కళ్యాణ్ వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడని తెలిసింది. అంతేకాదు.. ఆ స్టోరీలో వున్న మాస్ రోల్‌కి సాయి ధరమ్ కరెక్ట్‌గా సరిపోతాడని సజెస్ట్ చేశాడని.. దాంతో రవికుమార్ రీసెంట్‌గా సాయి ధరమ్‌ని కలసి స్టోరీ చెప్పాడని అంటున్నారు. తనకు 'పిల్లా నువ్వులేని జీవితం'తో మంచి హిట్ ఇచ్చిన రవికుమార్ చెప్పిన స్టోరీ బాగా నచ్చి వెంటనే ఓకే చెప్పాడట సాయిధరమ్.
ఈ ఇద్దరు హీరోలు పచ్చజెండా ఊపెయ్యడంతో డైరెక్టర్ రవికుమార్ పూర్తి స్క్రిప్ట్ రెడీ చేసే పనిలో వున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ మూవీని సీనియర్ ప్రొడ్యూసర్ కె.ఎస్.రామారావు నిర్మించనున్నారని... రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చనున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ మూవీని డిసెంబర్‌లో సెట్స్ పైకి తీసుకెళ్లే ఆలోచనలో వున్నట్లు ఫిల్మ్‌నగర్‌లో వార్తలు షికారు చేస్తున్నాయి. నందమూరి-మెగా హీరోల కాంబినేషన్‌లో రాబోతున్న ఈ మూవీపై అప్పుడే అభిమానుల్లో అంచనాలు పెరిగిపోతున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com