నీటిచుక్కను ఒడిసిపడితేనే భవిష్యత్‌ : ప్రధాని

- August 07, 2016 , by Maagulf
నీటిచుక్కను ఒడిసిపడితేనే భవిష్యత్‌ :  ప్రధాని

జలమే జీవమని ప్రతి నీటిచుక్కను ఒడిసిపడితేనే భవిష్యత్‌ అని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. గజ్వేల్‌ మండలం కోమటిబండలో ఏర్పాటుచేసిన సభలో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మిషన్‌ భగీరథ కార్యక్రమం విశిష్టమైనదన్నారు. కొన్నిరోజుల క్రితం సీఎం చంద్రశేఖరరావు తనతో సమావేశమైన సందర్భంలో తెలంగాణలో ఇంటింటికి తాగునీరు ఇచ్చే కార్యక్రమాన్ని ప్రవేశపెడుతున్నట్టు తెలిపారని వెల్లడించారు. గుజరాత్‌లోని కచ్‌ ప్రాంతంలో తన హయాంలో ప్రవేశపెట్టిన నీటి పథకాన్ని ఆదర్శంగా తీసుకొని ఈ పథకాన్ని చేపట్టినట్టు వెల్లడించడం ఎంతో ఆనందం కలిగించింది.
* దేశంలోని రైతాంగం కోసం కేంద్ర ప్రధాని సించాయ్‌ యోజన అనే పథకాన్ని ప్రవేశపెట్టింది. * దేశంలోని సాగుభూమికి తాగునీటి వసతి కల్పిస్తే మట్టిలో బంగారం పండుతుంది. * నీటి లభ్యతతోనే అన్ని రకాల అభివృద్ధి జరుగుతుంది. * మహాత్మాగాంధీ జన్మస్థలమైన పోరుబందర్‌లో రెండు వందల సంవత్సరాల క్రితమే వాననీటిని ఒడిసిపట్టేందుకు పలు పథకాలను రూపొందించారు. * సంప్రదాయ విద్యుత్‌ ఉత్పాదనతో పాటు సౌర విద్యుత్‌ను పెంచుకోవాల్సిన అవసరముంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com