వెస్ట్ బెంగాల్: జూన్ 1 నుంచి ఉచిత బస్సు ప్రయాణం
- May 11, 2026
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి రాష్ట్ర ప్రజలకు వరుస తీపి కబుర్లు అందించారు.ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేసే దిశగా అడుగులు వేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ముఖ్యంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం,కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య బీమా పథకం ఆయుష్మాన్ భారత్ అమలుపై ఆయన కీలక స్పష్టతనిచ్చారు.
మహిళలకు ఆర్థిక భరోసా: ఉచిత బస్సు ప్రయాణం
జూన్ 1వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయాన్ని కల్పిస్తున్నట్లు సీఎం వెల్లడించారు.
లబ్ధిదారులు: ఈ పథకం ద్వారా ఉద్యోగినులు, విద్యార్థినులతో పాటు ప్రజారవాణాపై ఆధారపడే లక్షలాది మంది మహిళలకు ప్రయోజనం చేకూరనుంది.
ఉద్దేశం: పెరుగుతున్న జీవన వ్యయాల దృష్ట్యా మధ్యతరగతి, పేద కుటుంబాలపై ఆర్థిక భారాన్ని తగ్గించడమే ఈ నిర్ణయం ప్రధాన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.
గతంలో రాష్ట్రంలో నిలిచిపోయిన కేంద్ర ఆరోగ్య బీమా పథకం ఆయుష్మాన్ భారత్ ను వచ్చే నెల నుంచి పునరుద్ధరించనున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ప్రస్తుతం అమల్లో ఉన్న ఇతర సామాజిక సంక్షేమ పథకాలన్నీ యధావిధిగా కొనసాగుతాయని ప్రజలకు హామీ ఇచ్చారు.
విద్యుత్, విద్య, ఇతర శాఖల్లో ఉద్యోగాల భర్తీకి సంబంధించి కేబినెట్ మరో కీలక నిర్ణయం తీసుకుంది.”పాఠశాలల్లో ఉద్యోగాల భర్తీకి సంబంధించి అభ్యర్థుల వయో పరిమితిని ఐదేళ్లు పొడిగించే ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపింది,” అని సీఎం సువేందు అధికారి వెల్లడించారు.ఈ నిర్ణయంతో రాష్ట్రంలోని వేలాది మంది నిరుద్యోగ అభ్యర్థులకు కొత్త అవకాశం లభించినట్లయింది. ప్రభుత్వ ఆదేశాలతో రాష్ట్ర యంత్రాంగం ఈ పథకాల అమలుకు సర్వం సిద్ధం చేస్తోంది.
తాజా వార్తలు
- అజ్మాన్ రోడ్డు ప్రమాదంలో కాలు కోల్పోయిన భారతీయుడికి Dh650,000 పరిహారం
- కెప్టెన్ స్మిత్ మచ్చర్‌కు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ప్రశంసలు
- సౌదీ అరేబియా జెడ్డాలో 11వ ఆయుర్వేద దినోత్సవం ఘనంగా నిర్వహణ
- పైలట్ కెప్టెన్ స్మిత్ కు గుజరాత్ గరిమా అవార్డు.. సీఎం భూపేంద్ర పటేల్ ప్రకటన
- ఒమన్‌లో 3.4% పెరిగిన ఆరోగ్య సంస్థలు..!!
- వృద్ధుల హెల్త్ చెకప్స్.. బహ్రెయిన్ ఎంపీ కీలక ప్రతిపాదనలు..!!
- యూఏఈలో కొత్త ప్రయాణ ప్రత్యామ్నాయంగా ఎతిహాద్ రైలు..!!
- ఖతార్ లో ప్లాంట్ 10 మిలియన్ ట్రీస్ ప్రాజెక్టులో భారీ పురోగతి..!!
- సౌదీలో పార్కింగ్‌పై కొత్త నిబంధనలు..!!
- కువైట్‌లో నిర్మాణ వ్యర్థాలు.. ఓనర్లకు కీలక సూచనలు..!!







