‘వీరభద్రుడు’ ట్రైలర్ వచ్చేసింది
- May 11, 2026
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన తమిళ చిత్రం ‘కరుప్పు’.. ఇప్పుడు తెలుగులో ‘వీరభద్రుడు’ పేరుతో విడుదలకు సిద్ధమైంది. ఆర్జే బాలాజీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ భారీ కోర్ట్ రూమ్ డ్రామా మే 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది. తాజాగా విడుదలైన ఈ చిత్ర తెలుగు ట్రైలర్ సినిమాపై అంచనాలను ఒక్కసారిగా పెంచేసింది.
”న్యాయం కావాలి.. న్యాయం కావాలి.. న్యాయవ్యవస్థకు న్యాయం కావాలి” అంటూ లాయర్లు నినదిస్తున్న పవర్‌ఫుల్ సీన్‌తో ట్రైలర్ ప్రారంభమైంది.సూర్య ఈ సినిమాలో రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపిస్తున్నట్లు ట్రైలర్ హింట్ ఇచ్చింది. మాస్ యాక్షన్ ఎలిమెంట్స్‌తో కూడిన ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ ఆకట్టుకుంటోంది.చాలా కాలం తర్వాత సూర్య-త్రిష జోడీ తెరపై మెరవనుంది. ఇందులో త్రిష ఒక పవర్‌ఫుల్ లాయర్ పాత్రలో కనిపించడం విశేషం.లాయర్ ముసుగులో నేరాలకు పాల్పడే ‘బేబీ కృష్ణ’ అనే నెగటివ్ షేడ్ ఉన్న పాత్రలో దర్శకుడు ఆర్జే బాలాజీ స్వయంగా నటించారు. అతని అరాచకాలకు వీరభద్రుడు ఎలా ముగింపు పలికాడు అనేదే ఈ సినిమా కథాంశం.
తెలుగులో ఈ సినిమాకు భారీ క్రేజ్ ఉంది. అక్కినేని నాగార్జునకు చెందిన అన్నపూర్ణ స్టూడియోస్ సంస్థ తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా విడుదల చేస్తోంది. భారీ ఎత్తున థియేటర్లను కేటాయించి సూర్య మార్కెట్‌ను క్యాష్ చేసుకునేందుకు సన్నాహాలు చేస్తున్నారు.యాక్షన్, కామెడీ, గ్రిప్పింగ్ కోర్ట్ రూమ్ డ్రామాగా రూపొందిన ‘వీరభద్రుడు’ సూర్య అభిమానులకు కన్నుల పండుగగా ఉండనుంది. మే 14న విడుదల కానున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభావాన్ని చూపుతుందో చూడాలి.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







