కువైటైజేషన్ ఆందోళనలు..ప్రవాసుల కోసం రుణ నిబంధనలు కఠినతరం..!!
- May 15, 2026
కువైట్ః కువైట్లోని స్థానిక బ్యాంకులు వ్యక్తిగత రుణ పరిమితులను తగ్గించడం మరియు రుణ మొత్తాలను ఉద్యోగుల పదవీ విరమణ ప్రయోజనాలకు ముడిపెట్టడం ద్వారా నివాసితులు మరియు కువైటీయేతరుల కోసం రుణ విధానాలను కఠినతరం చేయడం ప్రారంభించాయి. కొన్ని బ్యాంకులు ఇప్పుడు రుణ మొత్తం, రుణగ్రహీతకు రాబోయే పదవీ విరమణ బోనస్ విలువలోనే ఉండాలని షరతులు పెడుతున్నాయని తెలిసింది.
కువైటైజేషన్ విధానాలు లేదా ప్రైవేట్ రంగంలో ఉద్యోగ కోతలకు గురయ్యే అవకాశం ఉన్న రంగాలలో పనిచేస్తున్న ఉద్యోగుల విషయంలో బ్యాంకులు మరింత జాగ్రత్తతో వ్యవహారిస్తున్నాయి. ఇప్పటికే కొన్ని రంగాల్లోని ప్రవాస ఉద్యోగులకు రుణాలను బ్యాంకులు నిరాకరిస్తున్నాయి. అదే సమయంలో సురక్షితమైన ఉద్యోగాలు, అధిక జీతాలు, పెద్ద కంపెనీలలో పనిచేస్తున్న వారిపై బ్యాంకులు ఎక్కువ దృష్టి సారిస్తున్నాయని బ్యాంకింగ్ వర్గాలు తెలిపాయి.
కొన్ని బ్యాంకులు వ్యక్తిగత రుణాల కోసం కనీస జీతం నిబంధనను KD 500 కంటే ఎక్కువగా పెంచినట్లు తెలుస్తోంది. గతంలో KD 250 - KD 300 మధ్య జీతాలు పొందుతున్న వారికి రుణాలు ఇచ్చేవారు. అయితే, ఆరోగ్య సంరక్షణ, ఇంజనీరింగ్, విద్య, చమురు పరిశ్రమ వంటి ప్రత్యేక రంగాలలోని నిపుణులకు మినహాయింపులు ఉంటాయని బ్యాంకులు చెబుతున్నాయి.
తాజా వార్తలు
- చైనాలో ట్రంప్ పర్యటన..తైవాన్ అంశంపై ‘రెడ్ లైన్’ దాటొద్దని హెచ్చరిక!
- భారత్ నుంచి 5 దేశాల పర్యటనకు బయల్దేరిన ప్రధాని మోదీ
- కువైటైజేషన్ ఆందోళనలు..ప్రవాసుల కోసం రుణ నిబంధనలు కఠినతరం..!!
- భారత జెండా ఉన్న నౌక పై దాడిని ఖండించిన యూఏఈ..!!
- యూఏఈలో మోదీ: మహమ్మద్ బిన్ జాయెద్తో ఉన్నత స్థాయి చర్చలు..!!
- ఉచిత ప్రవేశాన్ని ప్రకటించిన ఖతార్ మ్యూజియమ్స్..!!
- ఫిలిప్పీన్స్ కార్మికులకు వైద్య పరీక్ష తప్పనిసరి..!!
- ఏడుగురు సౌదీలతో సహా 1750 మంది ఖైదీలు విడుదల..!!
- పంజాబ్స్ కింగ్స్ పై ముంబై ఇండియన్స్ ఘన విజయం..
- పీ-8ఐ యుద్ధ విమానాల భారీ నిర్వహణ కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–బోయింగ్ డిఫెన్స్ ఇండియా ఒప్పందం









