దుబాయ్ హత్య కేసులో అనుమానిత తోడు దొంగ భారతదేశం లో ఆత్మహత్య
- August 07, 2016
దుబాయ్ లో 11 సంవత్సరాల క్రితం ఒక మహిళ తప్పిపోయిన కేసులో పాత్ర ఉందని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఒక మహిళ, భారతదేశంలో దర్యాప్తు సంస్థ కస్టడీలో ఆత్మహత్య చేసుకొన్నట్లు తెలిసింది దేవయాని అలియాస్ అన్నీవర్గీస్ సెప్టెంబర్ 2005 లో దుబాయ్ లో కొత్త పెళ్ళి కూతురు స్మిత జార్జ్ తప్పిపోయిన కేసులో ఆమెకు సంబంధం ఉన్నట్లు అనుమానించి గత సంవత్సరం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు, కేరళలో నుంచి లభ్యమైన సమాచారం ప్రకారం, భారతదేశం యొక్క సెంట్రల్ బ్యూరో కస్టడీలో నెరపరిశోధనలో భాగంగా ప్రధాన నిందితుడైన స్మిత జార్జ్ భర్త సాబు ఆంటోనీ తో పాటు దేవయాని అలియాస్ అన్నీవర్గీస్ ను కేరళ నుండి మెదడు-మ్యాపింగ్ పరీక్షల కోసం గతనెలలో గుజరాత్ లోని గాంధీనగర్ తీసుకొని వెళ్తుండగా విష ద్రవం తీసుకోని ఆత్మహత్య చేసుకొంది. స్మితా జార్జ్ కుటుంబ న్యాయవాది షంషుద్దీన్ కరునాగప్పల్లి " మా గల్ఫ్ డాట్ కామ్ " తో మాట్లాడుతూ , సాబు ఆంటోనీకి ఇప్పటికే మేధో-మ్యాపింగ్ పరీక్షలు జరిగాయని, ఇక దేవయాని అలియాస్ అన్నీవర్గీస్ కు ఆ పరీక్షలు జరపవల్సి ఉందని చెప్పారు. వారిరువుర్ని జూన్ 14 వ తేదీన గుజరాత్ లోని గాంధీనగర్ కు తీసుకొనివస్తుండగా ఆమె గదులను శుభ్రం చేసే ఒక ప్రమాదకర ద్రవాన్ని తాగివేసింది. దీనితో దేవయాని అలియాస్ అన్నీవర్గీస్ ను ఏజెన్సీ ద్వారా గుజరాత్ లో ఒక ఆసుపత్రిలో చేర్పించారు సుమారు రెండు వారాలు చావు బతుకుల మధ్య పోరాటం చేస్తూ జూలై 9 వ తేదీన ఆమె చనిపోయినట్లు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. సిబిఐ ఆమె మరణ వార్తను నిర్ధారించింది.పాతికేళ్ల వయస్సు ఉన్న నవ వధువు స్మితజార్జ్ ని అప్పుడే పెళ్ళి చేసుకొన్న సాబు ఆంటోనీ సెప్టెంబర్ 3 వ తేదీ , 2005 న తన భార్య కనబడటం లేదని భర్త అల్ రఫా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కేవలం స్మితజార్జ్ రెండు రోజుల క్రేతమే దుబాయ్ కు వచ్చిందని, తన భార్య ఆమె మాజీ ప్రేమికుడితో ఇక్కడ్నించి పారిపోతున్నట్లు ఒక ఉత్తరం రాసినట్లు చెబుతూ అందులో ఈ విషయం పేర్కొందని పోలీసులని సాబు ఆంటోనీ నమ్మించే యత్నం చేశాడు. ఆ తర్వాత శాస్త్రీయంగా కేరళ పోలీసులు ఆ లేఖని పరిశీలించి ఉద్దేశ్యపూర్వకంగా ఇది స్మితజార్జ్ రాసిన లేఖ అది కాదని ఋజువు చేశారు. ఆ లేఖని సాబు ఆంటోనీ స్వయంగా రాసినట్లు పోలీసులు నిర్ధారించారు.కేరళ పోలీసు వర్గాల కథనం ప్రకారం దేవయాని అలియాస్ అన్నీవర్గీస్ సాబు ఆంటోనీ నివాసం ఉంటున్న అదే ఫ్లాట్ లో ఉండేది. సాబు ఆంటోనీ వివాహం తర్వాత సైతం దుబాయ్ లో అదే ఫ్లాట్లో నివసిస్తుంది. బు ఆంటోనీ తోఉంది. అంతకుముందు కేరళ కోర్టు కు దేవయాని అలియాస్ అన్నీవర్గీస్ చెబుతూ సాబూ అంటోని ఒక పదునైన ఆయుధం తో అతని భార్య స్మితజార్జ్ పై దాడి చేయడం ప్రత్యక్షంగా చూశానని ఒక సాక్ష్యం సమర్పించింది. సాబు ఆంటోనీని కేరళ పోలీసులు అరెస్టు చేశారు. ఇప్పుడు బెయిల్ పై బయటకు విడుదల చేశారు. దుబాయ్ పోలీసులు 10 సంవత్సరాల నుంచి మృతదేహాలను భద్రపరిచే ప్రదేశము లో స్మిత యొక్క అనుమానేత మృత శరీరంని భద్రపరిచారు. జన్యుపరమైన పరీక్షలు స్మిత యొక్క కుటుంబ శరీరంతో సరి పోల్చుతూ గుర్తించడానికి పరీక్షలు నిర్వహిస్తున్నారు.
తాజా వార్తలు
- టార్గెట్ షైబా ఫీల్డ్..16 డ్రోన్లను కూల్చిన సౌదీ అరేబియా..!!
- CBSE 12వ తరగతి బోర్డు పరీక్షలు వాయిదా..!!
- ఇరాన్ సుప్రీం లీడర్ నియామకంపై గందరగోళం
- గద్దర్ ఫిలిం అవార్డ్స్: విజేతల పూర్తి జాబితా ఇదే!
- బెంగళూరుకు రెండో అంతర్జాతీయ విమానాశ్రయం!
- సీఎం సమక్షంలో 124 మంది మావోయిస్టుల లొంగుబాటు
- క్షమించడండి అంటూ ఇరాన్ అధ్యక్షుడి కీలక ప్రకటన
- *బ్రేకింగ్: విమాన సర్వీసులను పునరుద్ధరించిన ఎమిరేట్స్! కన్ఫర్మ్డ్ టికెట్ ఉన్న ప్రయాణీకులకే!
- క్షతగాత్రులను పరామర్శించిన యుఏఈ అధ్యక్షుడు
- దుబాయ్ ఎయిర్పోర్ట్లో ఎటువంటి ప్రమాదాలు జరగలేదు: వదంతులను కొట్టిపారేసిన అధికారులు!









