ఎలిమినేటర్‌లో హైదరాబాద్‌కు బిగ్ షాక్..
- May 28, 2026
తప్పక గెలవాల్సిన ఎలిమినేటర్ మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఓటమి పాలైంది. రాజస్తాన్ రాయల్స్ చేతిలో పరాజయం చవిచూసింది. తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ 243 పరుగుల భారీ స్కోర్ చేసింది. 244 రన్స్ టార్గెట్ ను చేదించే క్రమంలో హైదరాబాద్ 19.2 ఓవర్లలో 196 పరుగులకే ఆలౌట్ అయ్యింది. దాంతో 47 పరుగుల తేడాతో రాజస్తాన్ విక్టరీ కొట్టింది.
కీలక మ్యాచ్ లో ఎస్ఆర్ హెచ్ బ్యాటర్లు చేతులెత్తేశారు. టాప్ ఆర్డర్ కుప్పకూలింది. 57 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. తొలి ఓవర్ లోనే అభిషేక్ శర్మ డకౌట్ అయ్యాడు. దాంతో ఎస్ఆర్ హెచ్ ఒత్తిడిలోకి వెళ్లింది. రాజస్తాన్ బౌలర్లలో ఆర్చర్ చెలరేగాడు. 3 వికెట్లు తీసి హైదరాబాద్ ను దెబ్బకొట్టాడు. బర్గర్, మిశ్రా, జడేజా తలో రెండు వికెట్లు తీశారు. యశ్ రాజ్ ఒక వికెట్ పడగొట్టాడు. ఇక, మే 29న గుజరాత్ టైటాన్స్ తో క్వాలిఫయర్ 2 ఆడనుంది రాజస్తాన్ రాయల్స్.
ఈ మ్యాచ్ హీరో 15ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీ అని చెప్పడంలో ఎలాంటి సందేహమూ లేదు. వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర బ్యాటింగ్ చేశాడు. సిక్సర్ల వర్షం కురిపించాడు. 29 బంతుల్లోనే 97 పరుగులు చేశాడంతో ఏ రేంజ్ లో ఊచకోత కోశాడో అర్థం చేసుకోవచ్చు. రాజస్థాన్ భారీ స్కోర్ చేయడంలో, ఎస్ఆర్ హెచ్ ను ఒత్తిడిలోకి నెట్టడంలో వైభవ్ సూర్యవంశీ రోల్ చాలా కీలకం.
తాజా వార్తలు
- ఎలిమినేటర్‌లో హైదరాబాద్‌కు బిగ్ షాక్..
- ఫైటర్ జెట్ల తయారీకి గ్రీన్ సిగ్నల్
- ఎవరెస్ట్ శిఖరం పై హైదరాబాదీ మృతి..
- ఏపీ ప్రభుత్వంతో BYST ఒప్పందం!
- ప్రధాని మోదీతో ముగిసిన సీఎం విజయ్ సమావేశం
- ఈద్ అల్-అధా శుభాకాంక్షలు తెలిపిన భారత రాయబారి పరామిత త్రిపాఠి..!!
- సుల్తాన్ ఖబూస్ మస్జీదులో ఈద్ ప్రార్థనలు చేసిన సుల్తాన్..!!
- మినాలో భద్రతను సమీక్షించిన ఇంటీరియర్ మినిస్టర్..!!
- లుసైల్ ప్యాలెస్లో ఈద్ అల్-అధా వేడుకల్లో పాల్గొన్న అమీర్..!!
- మనామా సూక్లో ఈద్ సందడి..జోరుగా సాగిన కొనుగోళ్లు..!!









