ఖతార్‌లో అమల్లోకి వచ్చిన ఔట్ సైడ్ సమ్మర్ వర్కింగ్ అవర్స్..!!

- June 01, 2026 , by Maagulf
ఖతార్‌లో అమల్లోకి వచ్చిన  ఔట్ సైడ్ సమ్మర్ వర్కింగ్ అవర్స్..!!

దోహ: ఖతార్ లో జూన్ 1నుండి ఔట్ సైడ్ వర్కింగ్ అవర్స్ నియంత్రణను అమలులోకి తీసుకువస్తున్నట్లు కార్మిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది.  జూన్ 1 నుండి సెప్టెంబర్ 15 వరకు ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 3:30 గంటల మధ్య ఔట్ డోన్ వర్కులు చేయడంపై నిషేధం విధించారు.
వేసవి నెలల్లో కార్మికులకు రక్షణ కల్పించడానికి మరియు సురక్షితమైన పని వాతావరణాన్ని నిర్ధారించడానికి చేపట్టిన జాతీయ స్థాయి ప్రయత్నాలలో భాగంగా ఈ చర్య అమలులోకి వస్తోంది. ఉష్ణోగ్రత సంబంధిత ఒత్తిడి (heat stress) నుండి రక్షణ కల్పించే చర్యలకు సంబంధించి జారీ చేసిన మంత్రిత్వ శాఖ నిర్ణయం ఉత్తర్వుల్లో భాగంగానే ఈ మేరకు చర్యలు తీసుకున్నట్లు కార్మిక మంత్రిత్వ శాఖ పేర్కొంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com