నంది అవార్డులకు త్వరలోనే కొత్త పేరు..

- August 09, 2016 , by Maagulf
నంది అవార్డులకు త్వరలోనే కొత్త పేరు..

చలనచిత్ర రంగంలో ఇచ్చే నంది అవార్డులకు త్వరలోనే కొత్త పేరు ప్రకటిస్తామని తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ తెలిపారు. చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధిపై అధికారులతో మంత్రి ఈరోజు సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. చిన్న సినిమాలను ప్రోత్సహించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రత్యేకంగా చర్చించారు. చిన్న సినిమాలను ప్రభుత్వం తరపున ప్రోత్సహిస్తామన్న మంత్రి.. అన్ని థియేటర్లలోనూ ఐదో ప్రదర్శనగా చిన్న సినిమాలకు అనుమతి ఇస్తామని తెలిపారు. 200 సీట్ల సామర్థంతో మినీ థియేటర్లకు త్వరలోనే అనుమతులు ఇస్తామని ప్రకటించారు. .

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com