'కళ్యాణం' అనే టైటిల్ తో చైతూ- తమన్నా

- August 09, 2016 , by Maagulf
'కళ్యాణం' అనే టైటిల్ తో చైతూ- తమన్నా

అదేంటి నాగచైతన్య పెళ్ళి సమంతతో జరగబోతోందని ఇప్పటివరకు వార్త చక్కర్లు కొట్టింది. మధ్యలో తమన్నా ఎలా వచ్చింది అనుకుంటున్నారా? నాగ చైతన్య చేయబోయే న్యూఫిల్మ్ టైటిల్ ఇది. నాగ చైతన్య హీరోగా అన్నపూర్ణ బ్యానర్‌పై నాగార్జునతో 'సోగ్గాడే చిన్ని నాయనా' డైరెక్ట్ చేసిన కళ్యాణ్ కృష్ణ తెరకెక్కించబోయే కొత్త ఫిల్మ్. దీనికి కళ్యాణం అనే టైటిల్ ఫిక్స్ చేశారు.మొదట ఈ మూవీలో సమంత హీరోయిన్‌గా నటిస్తుందని న్యూస్ వచ్చింది. కానీ, ఇప్పుడు నాగ చైతన్యతో 100% లవ్ చిత్రం చేసిన తమన్నాని హీరోయిన్‌గా ఫిక్స్ చేశారు. ఎట్ ప్రజెంట్ ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసే పనిలోవున్నాడు డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ. ఆ పనులు పూర్తికాగానే మూవీ మొదలుకానుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com