బహ్రెయిన్, కువైట్‌లపై దాడులపై స్పందించిన ఒమన్..!!
- June 04, 2026
మస్కట్: బహ్రెయిన్, కువైట్ లక్ష్యంగా జరిగిన దాడులను ఒమన్ సుల్తానేట్ తీవ్రంగా ఖండించింది. ఈ ప్రాంత భద్రత మరియు స్థిరత్వాన్ని దెబ్బతీసే అన్ని సైనిక చర్యలను, ముఖ్యంగా పౌర మరియు కీలక సౌకర్యాలను లక్ష్యంగా చేసుకోవడాన్ని పూర్తిగా తిరస్కరిస్తున్నట్టు స్పష్టం చేసింది. ఇలాంటి దాడులు అంతర్జాతీయ చట్టాన్ని ఉల్లంఘించడమే కాకుండా పౌరుల భద్రతకు ముప్పు కలిగిస్తాయిన ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మేరకు ఒమన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది.
బహ్రెయిన్, కువైట్ లకు సంఘీభావాన్ని ప్రకటించింది. వారి భద్రత, స్థిరత్వం, సార్వభౌమత్వం మరియు ప్రాదేశిక సమగ్రతను కాపాడుకోవడానికి వారు తీసుకునే చర్యలకు తమ మద్దతు ఉంటుందని స్పష్టం చేసింది. ఈ సందర్భంగా సంయమనం పాటించాలని, ఉద్రిక్తతలను నివారించాలని, సంక్షోభాలు మరియు వివాదాలను పరిష్కరించడానికి చర్చలు మరియు దౌత్య మార్గాలను ఆశ్రయించాలని ఒమన్ సుల్తానేట్ పిలుపునిచ్చింది.
తాజా వార్తలు
- గ్లోబల్ విలేజ్ సీజన్ 31 VIP ప్యాక్స్ విక్రయ తేదీలు వెల్లడి
- TGSRTC సంచలన నిర్ణయం..
- ఎయిర్ ఇండియా, ఉజ్బెకిస్థాన్ ఎయిర్‌వేస్‌తో ఫ్లైడుబాయ్ కొత్త భాగస్వామ్యాలు
- జనవరి 14 నుంచి ఉమెన్స్ ప్రీమియర్ లీగ్(WPL) ఐదో సీజన్.. !
- ప్రధాని మోదీకి తెలంగాణ గవర్నర్ జన్మదిన శుభాకాంక్షలు
- తిరుమలలో 32 ఉచిత ఈవీ బస్సులు ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- హైదరాబాద్‌లోనే తొలి మెట్రో-టు-రెసిడెన్షియల్ స్కైవాక్
- గాజా సిటీలో విషాదం..భవనం కూలి 16 మంది మృతి
- అబుదాబిలో మూడు ఘటనలు..కార్ల ఢీకొనడంతో పాదచారులకు గాయాలు
- దుబాయ్‌లో కొత్త 80 కి.మీ నాలుగో కారిడార్







