సౌదీలో విజిల్‌బ్లోయర్‌లు, సాక్షులు, బాధితుల ప్రొటెక్షన్ ప్రోగ్రామ్..!!

- June 06, 2026 , by Maagulf
సౌదీలో విజిల్‌బ్లోయర్‌లు, సాక్షులు, బాధితుల ప్రొటెక్షన్ ప్రోగ్రామ్..!!

రియాద్: క్రిమినల్, కరెప్షన్ సంబంధిత కేసులలో చిక్కుకున్న వ్యక్తులను కాపాడటమే లక్ష్యంగా.. విజిల్‌బ్లోయర్‌లు, సాక్షులు, నిపుణులు మరియు బాధితులను రక్షించడానికి సౌదీ అరేబియా ఒక కొత్త ప్రొటెక్షన్ ప్రోగ్రామ్ ను ప్రారంభించింది.   ఇది పబ్లిక్ ప్రాసిక్యూటర్ పర్యవేక్షణలో పనిచేస్తుంది. పబ్లిక్ ప్రాసిక్యూషన్, అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ, అవినీతి నిరోధక అథారిటీ (నజహా) నుండి ప్రతినిధులు సభ్యులుగా ఉంటారు.

సాక్షులకు ముప్పును కలిగించే సందర్భాలలో న్యాయస్థానాలు నిందితులు మరియు వారి న్యాయవాదులకు దూరంగా సాక్షుల వాంగ్మూలాలు, నిపుణుల అభిప్రాయాలను రికార్డు చేస్తారు. అలాగే, తీర్పుల నుండి సాక్షుల గుర్తింపులను గోప్యంగా పెడతారు.   

  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com