ఎబోలా ప్రభావిత దేశాలకు వీసాలను నిలిపివేసిన యూఏఈ..!!

- June 06, 2026 , by Maagulf
ఎబోలా ప్రభావిత దేశాలకు వీసాలను నిలిపివేసిన యూఏఈ..!!

యూఏఈ: ఎబోలా వైరస్ వ్యాప్తిని నివారించడానికి యూఏఈ అధికారులు కొత్త ముందుజాగ్రత్త చర్యలను ప్రకటించారు. ఎబోలా ప్రభావిత మూడు దేశాలైన డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, ఉగాండా మరియు దక్షిణ సూడాన్‌లకు చెందిన పౌరులకు కొత్త వీసాల జారీని నిలిపివేశారు.

జాతీయ అత్యవసర సంక్షోభ మరియు విపత్తుల నిర్వహణ అథారిటీ (NCEMA) మరియు ఐడెంటిటీ, సిటిజన్షిష్, కస్టమ్స్,  పోర్ట్ సెక్యూరిటీ ఫెడలర్ అథారిటీ (ICP) ఈ అదనపు ముందుజాగ్రత్త చర్యలను ప్రకటించాయి. వీసా సస్పెన్షన్ వెంటనే అమల్లోకి వస్తుందని పేర్కొంది.

జాబితాలో ఉన్న దేశాల నుండి వచ్చే ప్రయాణికులకు, అలాగే ఇతర దేశాల మీదుగా ట్రాన్సిట్ ద్వారా ప్రయాణించే వారికి కూడా యూఏఈలోకి ప్రవేశం పరిమితం చేయబడుతుందని స్పష్టం చేసింది.  యూఏఈకి రాకముందు, జాబితాలో ఉన్న దేశాల వెలుపల 21 రోజుల కంటే ఎక్కువ కాలం గడిపిన ప్రయాణికులకు మాత్రమే ప్రవేశం ఉంటుందన్నారు. అయితే, కార్గో విమాన సర్వీసులు ఎలాంటి అంతరాయం లేకుండా కొనసాగుతాయని స్పష్టం చేసింది.      

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com