ఇంపోర్టెట్ గూడ్స్ కు ప్యాలెట్ల వినియోగం తప్పనిసరి..!!

- June 06, 2026 , by Maagulf
ఇంపోర్టెట్ గూడ్స్ కు ప్యాలెట్ల వినియోగం తప్పనిసరి..!!

మస్కట్:  గల్ఫ్ సహకార మండలి దేశాల ఏకీకృత కస్టమ్స్ చట్టంలోని ఆర్టికల్ 44కు అనుగుణంగా, అన్ని దిగుమతి వస్తువులకు ప్యాలెట్ల వినియోగాన్ని రాయల్ ఒమన్ పోలీస్ (ఆర్‌ఓపి), డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ కస్టమ్స్ ప్రకటించాయి.  గూడ్స్ నిర్వహణ సామర్థ్యాన్ని మెరుగుపరచడం, కస్టమ్స్ క్లియరెన్స్ ప్రక్రియలను వేగవంతం చేయడం లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాయి.  జూలై 15 నుండి ల్యాండ్ బార్డర్స్ ద్వారా వచ్చే గూడ్స్ కు ఇది వర్తిస్తుంది. ఆ తర్వాత సెప్టెంబర్ 15 నుండి వాయు మరియు సముద్ర దిగుమతులకు తప్పనిసరిగా దరఖాస్తు చేసుకోవాలి.

ఉడ్, ప్లాస్టిక్ లేదా మెటల్ ప్యాలెట్లను ఉపయోగించి రవాణా మరియు నిర్వహణ అవసరమయ్యే వస్తువులకు ఈ నిబంధన వర్తిస్తుంది. అయితే, బల్క్ మెటీరియల్స్, భారీ పరికరాలు, పైపులు, రోల్స్, మరియు పాలరాయి లేదా రాతి దిమ్మెల వంటి ప్యాలెట్లపై ఉంచలేని వస్తువులకు మినహాయింపులు ఇచ్చారు. ఈ ప్రమాణాలకు అనుగుణంగా లేని ఏ డూడ్స్ ను అవి వచ్చిన దేశానికి తిరిగి పంపబడతాయని పేర్కొన్నది.  వ్యాపారులు మరియు భాగస్వాములందరూ ఈ కొత్త మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించాలని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ కస్టమ్స్ కోరింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com