70 మంది నర్సులను సత్కరించిన ఇండియన్ లేడీస్ అసోసియేషన్..!!

- June 06, 2026 , by Maagulf
70 మంది నర్సులను సత్కరించిన ఇండియన్ లేడీస్ అసోసియేషన్..!!

మనామా: బహ్రెయిన్ ఆరోగ్య సంరక్షణ రంగానికి సమిష్టిగా 1,000 సంవత్సరాలకు పైగా సేవ చేసిన 70 మంది విశిష్ట నర్సులకు ఇండియన్ లేడీస్ అసోసియేషన్ (ILA) ఘనంగా సత్కరించింది. ప్లాటినం జూబ్లీ వేడుకలలో భాగంగా ILA ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. బహ్రెయిన్ లో 25 సంవత్సరాలకు పైగా అంకితభావంతో సేవలను అందించిన వారిని గౌరవిస్తూ “నైటింగేల్స్ ఆఫ్ బహ్రెయిన్ – సర్వీస్ అవార్డ్ 2026” ను నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి బహ్రెయిన్ నర్సెస్ అండ్ మిడ్‌వైవ్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు సెహమ్ బుబ్‌షైత్ ముఖ్య అతిథిగా, బహ్రెయిన్ మెడికల్ అసోసియేషన్ అధ్యక్షుడు, అల్ హిలాల్ హెల్త్‌కేర్ గ్రూప్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ అయిన డాక్టర్ అమెర్ అల్-డెరాజీ గౌరవ అతిథిగా హాజరయ్యారు.  ఈ సందర్భంగా అవార్డు గ్రహీతలను ఆధునిక 'బహ్రెయిన్ నైటింగేల్స్'గా అభివర్ణించారు. విభిన్న నేపథ్యాలు మరియు వర్గాలకు చెందిన నర్సుల సమిష్టి కృషి బహ్రెయిన్ ఆరోగ్య సంరక్షణ రంగాన్ని బలోపేతం చేసిందని వక్తలు పేర్కొన్నారు. ముఖ్యంగా భారత ఉపఖండానికి చెందిన నర్సులు పోషించిన మార్గదర్శక పాత్రను వారు కొనియాడారు.      

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com