మాస్కోలోని స్బేర్ సిటీని సందర్శించిన మంత్రి లోకేష్

- June 06, 2026 , by Maagulf
మాస్కోలోని స్బేర్ సిటీని సందర్శించిన మంత్రి లోకేష్

మాస్కో: ఆంధ్రప్రదేశ్ ఐటీ, ఎలక్ట్రానిక్స్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రష్యా రాజధాని మాస్కోలో పర్యటించారు.ఇందులో భాగంగా అక్కడి ప్రతిష్టాత్మక ‘స్బేర్ సిటీ’ (SberCity)ని సందర్శించిన ఆయన, అక్కడ అందుబాటులో ఉన్న విప్లవాత్మక సాంకేతిక ఆవిష్కరణలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఆధునిక టెక్నాలజీ రంగంలో వస్తున్న మార్పులు, వాటిని ప్రజాసేవల్లో ఎలా ఉపయోగించవచ్చనే అంశాలపై ఆయన ప్రత్యేక ఆసక్తి కనబరిచారు.

వ్యాధి నిర్ధారణ చేసే ఏటీఎం..లోకేష్‌ను ఆకర్షించిన సరికొత్త ఆవిష్కరణ!
ఈ పర్యటనలో స్బేర్ బ్యాంక్‌కు చెందిన ఒక వినూత్న ఏటీఎం (ATM) మంత్రి లోకేష్‌ను విశేషంగా ఆకర్షించింది. కేవలం డబ్బులు డ్రా చేయడం, బ్యాంకింగ్ సేవలు అందించడమే కాకుండా.. రోగులకు ప్రాథమిక వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయగల సామర్థ్యం ఈ ఏటీఎంకు ఉండటం విశేషం. ఈ అద్భుత సాంకేతికత పనిచేసే విధానాన్ని అక్కడి నిపుణులను అడిగి తెలుసుకున్న మంత్రి, వారి ఆవిష్కరణను అభినందించారు.

పీపీటీ ద్వారా పరిశోధనల వివరణ
అనంతరం, స్బేర్ సిటీ ప్రతినిధులు తమ సంస్థ ఆధ్వర్యంలో జరుగుతున్న పరిశోధనలు (R&D), అభివృద్ధి కార్యక్రమాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మంత్రికి వివరించారు. ముఖ్యంగా క్వాంటం టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), డిజిటల్ హెల్త్‌కేర్, సైబర్ సెక్యూరిటీ మరియు డిజిటల్ ఎడ్యుకేషన్ రంగాలలో తాము సాధించిన ప్రగతిని, అందిస్తున్న డిజిటల్ పరిష్కారాలను లోకేష్‌కు కూలంకషంగా వివరించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com