రబీగ్ తీరంలో ఏడుగురిని రక్షించిన భద్రతా దళాలు..!!
- June 10, 2026
జెడ్డా: రబీగ్ గవర్నరేట్ తీరంలో ఎడుగురిని భద్రతా దళాలు రక్షించాయి. సముద్రంలో ప్రయాణిస్తున్నప్పుడు వారి నౌకలో సాంకేతిక లోపం తలెత్తి ఆగిపోయింది. సమాచారం అందుకున్న మక్కా సరిహద్దు రక్షక దళానికి చెందిన సహాయక బృందాలు ఏడుగురిని గుర్తించి విజయవంతంగా రక్షించాయి.
రెస్క్యూ చేసిన వారిలో ఆరుగురు సౌదీ పౌరులు మరియు ఒక ఈజిప్టు నివాసి ఉన్నారని సరిహద్దు రక్షక దళ జనరల్ డైరెక్టరేట్ పేర్కొంది. సముద్ర ప్రయాణంలో భద్రతా నిబంధనలు మరియు సూచనలను ఖచ్చితంగా పాటించాలని డైరెక్టరేట్ సూచించింది.
నౌకలను తరచూ చెక్ చేసుకోవాలని, అన్ని వేళలా లైఫ్ జాకెట్లు ధరించాలని మరియు అత్యవసర పరిస్థితుల్లో సహాయం కోసం మక్కా, మదీనా మరియు తూర్పు ప్రావిన్స్ లో 911 అత్యవసర నంబర్‌కు లేదా ఇతర ప్రాంతాలలో 994 నంబర్ లో సంప్రదించాలని డైరెక్టరేట్ కోరింది.
తాజా వార్తలు
- దుబాయ్‌లో బస్సు ప్రమాదం..ఇంకా ముగ్గురి పరిస్థితి విషమం..!!
- కువైట్‌లో 8 రోజుల్లో 1,308 యాక్సిడెంట్లు..!!
- జెడ్డాలో 20 టన్నుల పాడైన ఆహారం ధ్వంసం..!!
- వినియోగదారుల హక్కుల ఉల్లంఘనకు OMR2,000 ఫైన్..!!
- AI తప్పుడు కంటెంట్ పోస్టులు..వ్యక్తి అరెస్ట్..!!
- ఇరాన్ దాడులను ఖండించిన ఖతార్..!!
- సౌదీలో జూన్ 14 నుండి ఎంటర్ ప్రెన్యూర్షిప్ వీక్..!!
- ఎమిరేట్స్ రోడ్ ఘోర ప్రమాద బాధితులకు Dh1 మిలియన్ సాయం ప్రకటించిన యూఏఈ బిలియనీర్
- దుబాయ్ వాటర్‌ఫ్రంట్ రెస్టారెంట్ సమీపంలో వేల్ షార్క్ హల్చల్..!!
- రబీగ్ తీరంలో ఏడుగురిని రక్షించిన భద్రతా దళాలు..!!









