దుబాయ్ వాటర్‌ఫ్రంట్ రెస్టారెంట్ సమీపంలో వేల్ షార్క్ హల్చల్..!!

- June 10, 2026 , by Maagulf
దుబాయ్ వాటర్‌ఫ్రంట్ రెస్టారెంట్ సమీపంలో వేల్ షార్క్ హల్చల్..!!

యూఏఈ: దుబాయ్ వాటర్‌ఫ్రంట్‌లోని ప్రముఖ రెస్టారెంట్ '3 ఫిల్స్' సమీపంలో వేల్ షార్క్ కనిపించిందని హోటల్ మేనేజ్ మెంట్ తెలిపింది. ఈ మేరకు ఒక వేల్ షార్క్ ఫుటేజ్‌ను షేర్ చేసింది.  దానికి "ఊహించని అతిథి! పోల్కా వేల్ షార్క్" అని క్యాప్షన్ పెట్టారు.

దుబాయ్ వాటర్‌ఫ్రంట్ రెస్టారెంట్ సమీపంలో కనిపించిన వేల్ షార్క్, భోజనం చేస్తున్న వారిని ఆశ్చర్యపరిచింది. ఇది ఆన్‌లైన్‌లో త్వరగా వైరల్ అయి అందరి దృష్టిని ఆకర్షించింది.  

వేల్ షార్క్‌ లు ప్రపంచంలోనే అతిపెద్ద చేప జాతికి చెందినది. వీటిని మానవులకు హానికరమైనవిగా పరిగణించరు. . ఇవి అప్పుడప్పుడు యూఏఈ జలాల్లో కనిపిస్తాయి. ముఖ్యంగా ఆహారం కోసం అవి తీరానికి దగ్గరగా వస్తుంటాయి.

అయితే, ఈ ఫుటేజీని ఎప్పుడు రికార్డ్ చేశారో రెస్టారెంట్ యాజమాన్యం వెల్లడించలేదు.   

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com