'ప్రేమమ్' మధుర ప్రణయ కావ్యం...
- August 09, 2016
మలయాళంలో ఘనవిజయం సాధించి, విమర్శకుల మెప్పు పొందిన చిత్రం 'ప్రేమమ్'. ఈ చిత్రాన్ని అదే పేరుతో తెలుగులో రీమేక్ చేస్తున్నారు. నాగచైతన్య కథానాయకుడు. శ్రుతిహాసన్, మడొన్నా సెబాస్టియన్, అనుపమ పరమేశ్వరన్ కథానాయికలు. చందు మొండేటి దర్శకుడు. సూర్యదేవర నాగవంశీ నిర్మాత. ఈనెల 24న పాటల్ని విడుదల చేయనున్నారు. నిర్మాత మాట్లాడుతూ ''ఇదో చక్కటి దృశ్యకావ్యం. అందరికీ నచ్చేలా తీర్చిదిద్దాం. చైతన్య కెరీర్లో మరపురాని చిత్రంగా నిలుస్తుంది. ఈనెల 18న తొలి పాట విడుదల చేస్తాం. వచ్చే నెల 9న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామ''న్నారు. ఈశ్వరీరావు, జీవా, బ్రహ్మాజీ, శ్రీనివాసరెడ్డి, ప్రవీణ్, చైతన్య కృష్ణ ఇతర పాత్రధారులు. చిత్రానికి సంగీతం: గోపీ సుందర్
తాజా వార్తలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..







