సంక్రాంతి బరిలో 'శతమానం...'
- August 09, 2016
శ ర్వానంద్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటిస్తున్న చిత్రం 'శతమానం భవతి'. దిల్ రాజు నిర్మాత. వేగేశ్న సతీష్ దర్శకుడు. మంగళవారం హైదరాబాద్‌లో ఈ చిత్రం లాంఛనంగా ప్రారంభమైంది. దిల్ రాజు మాట్లాడుతూ ''పది సంవత్సరాల క్రితం ఇదే రోజున 'బొమ్మరిల్లు' విడుదలైంది. ఆ చిత్రం మా సంస్థకు మంచి పేరు తీసుకొచ్చింది. 'శతమానం భవతి' అలాంటి మంచి కథే. 'బొమ్మరిల్లు' తండ్రీ కొడుకుల అనుబంధం నేపథ్యంలో సాగుతుంది. ఈ చిత్రం తాతామనవళ్ల ప్రేమానురాగాలతో నడుస్తుంది. వచ్చే సంక్రాంతికి చిత్రాన్ని విడుదల చేస్తామ''న్నారు. ప్రకాష్‌రాజ్, జయసుధ ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: సమీర్‌రెడ్డి, సంగీతం: మిక్కీ జె.మేయర్, కూర్పు: మధు
తాజా వార్తలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్‌లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్‌లో భారతీయ పాస్‌పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..







