కృష్ణా పుష్కరాలు కు సంపూకి ఆహ్వానం..

- August 10, 2016 , by Maagulf
కృష్ణా పుష్కరాలు కు సంపూకి  ఆహ్వానం..

హృదయ కాలేయం చిత్రంతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంపూర్ణేష్ బాబు ప్రస్తుతం అటు సపోర్టింగ్ క్యారెక్టర్స్‌లోను ఇటు హీరోగాను రాణిస్తున్నాడు. సంపూ తాజాగా కొబ్బరిమట్ట అనే చిత్రంలో నటిస్తోండగా ఈ చిత్రం విడుదలకు రెడీ అవుతోంది. పెదరాయుడు, ఆండ్రాయిడ్, పాపారాయుడు అనే మూడు పాత్రలలో కనిపించనున్నాడు సంపూ. తాజాగా కొబ్బరి మట్ట ట్రైలర్‌ని విడుదల చేయగా, ఇందులో సంపూ చెప్పిన డైలాగ్‌కి ప్రేక్షకులు జేజేలు పలికారు. రోజు రోజుకి సంపూ క్రేజ్ మరింత పెరుగుతూ వస్తోంది. ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకత సంపాదించుకున్న సంపూ తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి ఆహ్వానాన్ని అందుకున్నాడు. ఆగస్ట్ 12 నుండి కృష్ణా పుష్కరాలు ప్రారంభం కానుండగా ఈ పుష్కరాలకు ఆహ్వానిస్తూ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సంపూకీ స్పెషల్ ఇన్విటేషన్ పంపింది. ఏపీ ప్రభుత్వం నుండి తనకు ఆహ్వానం రావడంతో సంపూ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. తనకు వచ్చిన ఇన్విటేషన్‌ని ఫోటో తీసి ట్విట్టర్‌లో పోస్ట్ చేసాడు ఈ బర్నింగ్ స్టార్.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com