మడేయిరా దీవుల్లో మంటలు...
- August 10, 2016
ఆఫ్రికా వాయవ్య తీరంలోని పోర్చుగల్ తగలబడిపోతోంది. మడేయిరా దీవుల్లో మంటలు అంటుకుని పెద్ద ఎత్తున విస్తరిస్తున్నాయి. మంటల బారినపడి ఇప్పటి వరకు 174 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరంతా వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మంటలు క్రమంగా రాజధాని ఫుంచాల్ను ఆక్రమిస్తున్నాయి. ఇప్పటి వరకు 27 నివాసాలను ఖాళీ చేయించినట్టు ప్రభుత్వ ప్రతినిధి ఒకరు తెలిపారు. కాగా చాలా రోజులుగా పోర్చుగీసులో కార్చిచ్చు కొనసాగుతోంది. రంగంలోకి దిగిన ఫైర్ ఫైటర్లు ఏడు ప్రాంతాల్లో చెలరేగిన మంటలను అదుపు చేయడం తమవల్ల కాదని చేతులెత్తేశారు. కాగా 4 వేలమంది అగ్నిమాపక సిబ్బంది, 26 వాటర్ డంపింగ్ విమానాలు, 1262 వాహానాలతో 149 చోట్ల మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్టు ఉన్నతాధికారులు పేర్కొన్నారు. ఈ నెలలో పోర్చుగల్లో ఉష్ణోగ్రతలు అధికస్థాయిలో ఉండడం, ఈదురు గాలులు తాకిడి ఎక్కువగా ఉండడం పోర్చుగల్లో సర్వసాధారణం. ప్రస్తుత పరిస్థితికి ఇదే కారణంగా అధికారులు భావిస్తున్నారు. మంటలు అదుపులోకి వచ్చేదెప్పుడో తెలియక ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. వందలాదిమంది ప్రజలు సురక్షిత ప్రాంతాలకు చేరుకున్నారు.
తాజా వార్తలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..







